Avika Gor : ఆరేళ్ళ ప్రేమ.. పెళ్లి చేసుకున్న చిన్నారి పెళ్లికూతురు..
అవికా గోర్ ఇటీవల జూన్ లో తన ప్రియుడు మిలింద్ చాంద్వానితో నిశ్చితార్థం చేసుకున్నట్టు ప్రకటించింది. (Avika Gor)

Avika Gor
Avika Gor : చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తో నేషనల్ వైడ్ ఫేమ్ తెచ్చుకున్న అవికా గోర్ తర్వాత హీరోయిన్ గా మారింది. తెలుగులో ఉయ్యాలా జంపాల సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి లక్ష్మి రావే మా ఇంటికి, సినిమా చూపిస్తా మామ, రాజుగారి గది 3.. లాంటి పలు సినిమాలతో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు కన్నడ, హిందీ లో కూడా పలు సినిమాలు, సిరీస్ లలో నటించింది. ప్రస్తుతం హీరోయిన్ గా నటిస్తూనే నిర్మాతగా కూడా సినిమాలు చేస్తుంది.(Avika Gor)
అవికా గోర్ ఇటీవల జూన్ లో తన ప్రియుడు మిలింద్ చాంద్వానితో నిశ్చితార్థం చేసుకున్నట్టు ప్రకటించింది. గత ఆరేళ్లుగా మిలింద్ చాంద్వాని అనే వ్యాపారవేత్తతో అవికా ప్రేమలో ఉంది. ఈ ప్రేమను ఎప్పుడో తన సోషల్ మీడియా ద్వారా బహిర్గతం చేసింది. ఎట్టకేలకు ఈ జంట పెళ్లి చేసుకుంటున్నారు.
Also Read : Pawan Kalyan : మెగా షో తర్వాత పవన్ కళ్యాణ్ కామెంట్స్.. OG యూనివర్స్ ఉంది.. వీడియో వైరల్..
నేడు ముంబైలో అవికా గోర్ – మిలింద్ చాంద్వానిల వివాహం ఘనంగా జరుగుతుంది. ఈ వేడుకకు అనేకమంది సినీ, వ్యాపార ప్రముఖులు హాజరవుతున్నారు. పెళ్లి వేడుకకు వెళ్లేముందు బయట మీడియాకు సెలబ్రిటీలు పోజులు ఇస్తున్నారు. దీంతో ఈ వీడియోలు వైరల్ గా మారాయి. ఇక ఫ్యాన్స్, నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Newly wed #AvikaGor and #MilindChandwani ❤️ pic.twitter.com/fp7iIZw9aQ
— GlamWorldTalks (@GlamWorldTalks) September 30, 2025
Also Read : OG Song : OG సినిమా ‘సువ్వి సువ్వి..’ సాంగ్ షూట్ చేసింది ఇక్కడే.. ఈ హిస్టారికల్ ప్లేస్ ఎక్కడో తెలుసా?