Baby Movie : గుండెకు హత్తుకునే ప్రేమకావ్యంలా బేబీ టీజర్..

నేషనల్ అవార్డు విన్నింగ్ మూవీ కలర్ ఫోటోని నిర్మించిన సాయి రాజేష్ దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న చిత్రం 'బేబీ'. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ హీరోలుగా నటిస్తుండగా.. షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ తో పాపులర్ అయిన వైష్ణవి చైతన్య ఈ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. ఇక ఈ సినిమా టీజర్ సోమవారం విడుదల చేసింది చిత్ర యూనిట్. టీజర్ మొదటిలోనే..

Baby Movie : గుండెకు హత్తుకునే ప్రేమకావ్యంలా బేబీ టీజర్..

Baby Movie Teaser Released

Updated On : November 22, 2022 / 10:50 AM IST

Baby Movie : నేషనల్ అవార్డు విన్నింగ్ మూవీ కలర్ ఫోటోని నిర్మించిన సాయి రాజేష్ దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న చిత్రం ‘బేబీ’. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ హీరోలుగా నటిస్తుండగా.. షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ తో పాపులర్ అయిన వైష్ణవి చైతన్య ఈ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. డైరెక్టర్ మారుతి, SKN కలిసి మాస్ మూవీ మేకర్స్ పథకంపై ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Vaishnavi Chaitanya : సినిమా రిలీజ్ అవ్వకుండానే హీరోయిన్ గా మూడు సినిమాల ఛాన్స్ కొట్టేసిన తెలుగమ్మాయి..

ఇక ఈ సినిమా టీజర్ సోమవారం విడుదల చేసింది చిత్ర యూనిట్. టీజర్ మొదటిలోనే.. “మొదటి ప్రేమకి మరణం లేదు, మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది” అంటూ సినిమా ఫస్ట్ లవ్ నేపథ్యంతో ఉండబోతుందని చెప్పేశాడు దర్శకుడు. స్కూల్ లో మొదలైన ప్రేమని నేచురాలిటీకి చాలా దగ్గరగా చూపించే ప్రయత్నం చేశారు మేకర్స్. ఆ క్రమంలోనే హీరోయిన్ వైష్ణవిని డిగ్లామరైజ్డ్ పాత్రలో చూపించారు.

“కుడి కన్ను అదిరితే మంచి జరుగుతుందని, ఎడమ కన్ను అదిరితే చెడు జరుగుతుందని, కానీ ఏదో జారబోతుందని తెలిసినప్పుడు మాత్రం అమ్మాయిలకు గుండెల్లో అదురుతుంది” అనే మాటలతో టీజర్ చాలా అందంగా సాగింది. విజయ్ బూల్గ్‌నిన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. టీజర్ బట్టి చూస్తే ఇది ఒక ట్రైయాంగిల్ లవ్ స్టోరీ అని తెలుస్తుంది. మొత్తానికి టీజర్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉంది.