Bakasura Title Rap : ‘బకాసుర రెస్టారెంట్’ టైటిల్ ర్యాప్ సాంగ్ రిలీజ్.. అనిల్ రావిపూడి చేతుల మీదుగా..

మీరు కూడా ఈ సాంగ్ వినేయండి..

Bakasura Title Rap : ‘బకాసుర రెస్టారెంట్’ టైటిల్ ర్యాప్ సాంగ్ రిలీజ్.. అనిల్ రావిపూడి చేతుల మీదుగా..

Bakasura Title Rap

Updated On : July 5, 2025 / 9:27 PM IST

Bakasura Title Rap : క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌, కమెడియన్‌ ప్రవీణ్‌ మెయిన్ లీడ్ లో తెరకెక్కుతున్న సినిమా ‘బకాసుర రెస్టారెంట్‌’, వైవా హర్ష, కృష్ణభగవాన్‌, షైనింగ్‌ ఫణి, కేజీఎఫ్‌ గరుడరామ్‌.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్‌జే మూవీస్‌ బ్యానర్ పై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్‌ ఆచారి నిర్మాణంలో ఎస్‌జే శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తవ్వగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. త్వరలోనే ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి బకాసుర టైటిల్‌ ర్యాప్‌ సాంగ్‌ను డైరెక్టర్ అనిల్‌ రావిపూడి చేతుల మీదుగా రిలీజ్ చేసారు. వికాస బడిస సంగీత దర్శకత్వంలో ఈ ర్యాప్‌ సాంగ్ ని రోల్‌ రైడ రాయగా వికాస బడిస, రోల్ రైడ కలిసి పాడారు.

Also Read : Naveen Chandra : ఎన్టీఆర్ తో సినిమా.. ఫస్ట్ నో చెప్పాడంట.. నవీన్ చంద్రను ఎవరు ఒప్పించారో తెలుసా?

మీరు కూడా ఈ సాంగ్ వినేయండి..

 

సాంగ్ రిలీజ్ అనంతరం అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ.. బకాసుర రెస్టారెంట్‌ టైటిల్‌తో పాటు ఈ పాట కూడా బాగుంది. చాలా కొత్తగా అనిపించింది. సినిమా ఐడియా బాగుంది. నటుడు ప్రవీణ్‌ నాకు మొదట్నుంచి తెలుసు. ప్రవీణ్‌ హీరోగా రాబోతున్న ఈ సినిమా సక్సెస్‌ కావాలి అని అన్నారు.

Bakasura Title Rap

డైరెక్టర్ మాట్లాడుతూ.. హంగర్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రతి సీన్ ఆడియన్స్‌కు థ్రిల్లింగ్‌తో పాటు వినోదాన్ని కూడా పంచుతుంది. ఓ ఇన్నోవేటివ్‌ కాన్సెప్ట్‌తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాం అని తెలిపారు.

Also Read : Pawan Kalyan – Sagar : పవర్ స్టార్ తో మొగలి రేకులు ఫేమ్ సాగర్.. స్పెషల్ మీట్.. ఎందుకో తెలుసా?