Balagam: బలగం చిత్రానికి మరో మూడు ఇంటర్నేషనల్ అవార్డ్స్
టాలీవుడ్ మూవీ ‘బలగం’ ఇంటర్నేషనల్ వేదికపై మరోసారి సత్తా చాటింది. ఈ సినిమాకు తాజాగా మరో మూడు అంతర్జాతీయ అవార్డులు లభించాయి.

Balagam Movie Gets Three More International Awards
Balagam: టాలీవుడ్‌లో ఇటీవల రిలీజ్ అయిన ‘బలగం’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను జబర్దస్త్ ఫేం వేణు యెల్దండి డైరెక్ట్ చేయగా పూర్తి ఫ్యామిలీ ఎమోషన్స్ నేపథ్యంలో ఈ సినిమా వచ్చింది. ఇక ఈ సినిమాకు జనం ఏ విధంగా బ్రహ్మరథం పట్టారో మనం చూశాం. ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యాక ప్రేక్షకాదరణ మరింతగా పెరిగింది. ఊళ్లలో స్క్రీన్లు వేసి మరీ ఈ సినిమాను చూస్తున్నారు.
Balagam : మా మనోభావాలు దెబ్బతిన్నాయి.. బలగం సినిమాపై ఫిర్యాదు చేసిన ఎంపీటీసీలు..
అంతలా పాపులారిటీ సంపాదించిన ఈ సినిమా గ్లోబల్‌గానూ సత్తా చాటుతోంది. ఇప్పటికే పలు ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ అవార్డులను అందుకున్న బలగం దూసుకుపోతుంది. తాజాగా మరో మూడు ఇంటర్నేషనల్ అవార్డులు ఈ సినిమాకు దక్కాయి. ది గోల్డెన్ బ్రిడ్జ్ ఇస్తాన్‌బుల్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ 2023లో బలగం మూవీ ఏకంగా మూడు అవార్డులను గెలుచుకుంది. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ లీడ్ యాక్టర్ విభాగాల్లో బలగం మూవీకి అవార్డులు దక్కాయి.
Balagam : ఒకే ఫిలిం ఫెస్టివల్ లో 9 ఇంటర్నేషనల్ అవార్డులు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించిన బలగం..
అంతర్జాతీయ వేదికపై బలగం ఇలా వరుసగా అవార్డులు దక్కించుకుంటుండటంతో ఈ సినిమా మున్ముందు మరిన్ని అవార్డులు అందుకోవాలని అభిమానులు కోరుతున్నారు. ఇక ఈ సినిమాలో ప్రియదర్శి హీరోగా నటించగా, కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్‌గా నటించింది. భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందించగా హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు.
— Venu Yeldandi #Balagam (@VenuYeldandi9) April 19, 2023