Balakrishna : NBK109 సినిమా నుండి అదిరిపోయే అప్డేట్.. సెకండాఫ్ 40 నిముషాలు.. కానీ ఏపీ పాలిటిక్స్ వల్ల..
సినిమా నిర్మాత సూర్యదేవర నాగవంశీ తన 'మ్యాడ్' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో NBK109 సినిమా గురించి మాట్లాడారు.

Balakishna Director Bobby Producer Naga Vamsi NBK 109 Movie Update
NBK109 Movie : బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నారు. అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ 100 కోట్ల సూపర్ హిట్స్ కొట్టారు బాలకృష్ణ. ప్రస్తుతం బాలకృష్ణ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో NBK108 సినిమా ‘భగవంత్ కేసరి’ చేస్తున్నారు. ఈ సినిమా దసరాకి రిలీజ్ కానుంది. ఆ తర్వాత బాబీ దర్శకత్వంలో NBK109 సినిమా చేస్తున్నారు.
ఇప్పటికే NBK 109 సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమం కూడా జరిగింది. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు. సినిమా నుంచి ప్రపంచానికి ఇతను తెలుసు, కానీ ఇతని ప్రపంచం ఎవ్వరికి తెలీదు అనే కొటేషన్ తో ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. 1980 లో స్టోరీతో ఈ సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. తాజాగా ఈ సినిమా నిర్మాత సూర్యదేవర నాగవంశీ తన ‘మ్యాడ్’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో NBK109 సినిమా గురించి మాట్లాడారు.
నాగవంశీ మాట్లాడుతూ.. జైలవకుశ సినిమా తర్వాత డైరెక్టర్ బాబీని నేనే వెళ్లి బాలకృష్ణతో ఒక సినిమా చేసి పెట్టమని అడిగాను. ఆ తర్వాత అతను వేరే సినిమాలతో బిజీ అయినా, బాలకృష్ణతో సినిమా తీస్తే కచ్చితంగా నా నిర్మాణంలోనే తీస్తాను అని మాట ఇచ్చాడు. వాల్తేరు వీరయ్య తర్వాత బాలకృష్ణకు కథ చెప్పి సినిమా ఓకే చేశాము. ఇప్పటివరకు బాలయ్య బాబుని చూడని ఒక కొత్త రూపంలో చూస్తారు ఈ సినిమాలో. మీరు ఊహించని రేంజ్ లో సినిమా ఉంటుంది. సెకండ్ హాఫ్ లో ఒక 40 నిముషాలు అయితే వేరే లెవల్ లో ఉంటుంది. ఇప్పుడు సినిమా షూటింగ్ మొదలవ్వాలి కానీ ఏపీలో రాజకీయాల వల్ల బాలకృష్ణ గారు అటు బిజీ ఉండటంతో సినిమా షూట్ లేట్ అవుతుంది అని చెప్పారు. దీంతో బాలయ్య ఫ్యాన్స్ ఇప్పట్నుంచే ఈ సినిమాపై కూడా అంచనాలు పెంచేసుకుంటున్నారు.
Something Big and Massive.Never before mass loading 🥵🥵
Can't wait 🔥 @dirbobby @ThisIsDSP pic.twitter.com/NmPnCM568k
— NBK Cult 🦁 (@iam_NBKCult) October 2, 2023