Balakrishna : మా జీవనం కోసం కాదు.. ఇండస్ట్రీ బ్రతకడం కోసం నటిస్తున్నాము.. సీనియర్ హీరోల గురించి బాలయ్య కామెంట్స్!

జగపతిబాబు ‘రుద్రంగి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యిన బాలయ్య.. తన తోటి సీనియర్ హీరోల గురించి, హీరోయిన్ మమతా మోహన్‌దాస్‌ గురించి గొప్పగా మాట్లాడాడు.

Balakrishna : మా జీవనం కోసం కాదు.. ఇండస్ట్రీ బ్రతకడం కోసం నటిస్తున్నాము.. సీనియర్ హీరోల గురించి బాలయ్య కామెంట్స్!

Balakrishna about his co actors and Jagapathi Babu Mamta Mohandas

Updated On : June 30, 2023 / 9:59 AM IST

Balakrishna : జగపతిబాబు (Jagapathi Babu), మమతా మోహన్‌దాస్‌ (Mamta Mohandas), ఆశిష్‌గాంధీ, విమలా రామన్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘రుద్రంగి’ (Rudrangi). అజయ్‌ సామ్రాట్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాని తెలంగాణ ఎమ్మెల్యే డా రసమయి బాలకిషన్‌ నిర్మించారు. జులై 7న రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురువారం (జూన్ 29) నాడు హైదరాబాద్‌లో గ్రాండ్ గా జరిగింది. ఇక ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.

Balakrishna : సుమకి చెంప దెబ్బలు పడాలి.. జగపతిబాబు సినిమా ఫంక్షన్‌లో బాలకృష్ణ వ్యాఖ్యలు..

ఈ ఈవెంట్ బాలకృష్ణ మాట్లాడుతూ.. “ప్రేక్షకులను కథ మరియు పాత్రల్లో లీనమయ్యేలా చేసే అరుదైన సినిమాల్లో ‘రుద్రంగి’ కూడా ఒకటి. ఇక జగపతిబాబు ఎన్నో గొప్ప పాత్రలు చేశారు. లెజెండ్, రంగస్థలం సినిమాల్లో ఆయన నటన అమోఘం. ఆయన కోసమే ఆడియన్స్ థియేటర్స్ కి వచ్చేంతలా ఆయన నటన ఆడియన్స్ ని మెప్పించింది. ఎంపిక చేసుకున్న పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి క్యారెక్టర్లలో జీవించాలి, నటించడం కాదు. అలా పాత్రలో జీవించే గొప్ప నటుడు మా జగపతి బాబు. టాలీవుడ్‌ లోనే కాదు మొత్తం భారతీయ చిత్రసీమలోనే గొప్ప నటుడు. మేమంతా ఇప్పుడు మా జీవినం కోసం నటించడం లేదు. ఆ స్టేజిని నుంచి మేము ఎప్పుడో దాటేశాం. ఇప్పుడు ఇండస్ట్రీని బ్రతికించడానికి కోసం మేము ఇంకా నటిస్తూ వస్తున్నాం” అంటూ తన తోటి సీనియర్ హీరోలను అందర్నీ దృష్టిలో పెట్టుకొని వ్యాఖ్యానించాడు.

Ram Charan : రామ్ చరణ్ కూతురి బారసాల నేడే.. బంగారు ఊయల బహుమతిగా ఇచ్చిన అంబానీ!

అలాగే ఈ సినిమాలో నటించిన మమతా మోహన్‌దాస్‌ గురించి మాట్లాడుతూ.. “ఆమె ఆన్ స్క్రీన్ లోనే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా వీర వనిత. ఆమె కాన్సర్ బారిన పడిన విషయం తెలిసిందే. కాన్సర్ అనే భయమే ఆ వ్యక్తి సగం చంపేస్తుంది. కానీ ఆమె ధైర్యంగా పోరాడి నేడు మళ్ళీ ఇలా మన ముందుకు వచ్చారు. ఎంతోమంది మహిళలకు, ప్రతి క్యాన్సర్‌ రోగికీ మమతా మోహన్‌దాస్‌ ఆదర్శం” అంటూ ప్రశంసించాడు.