నందమూరి, దగ్గుబాటి మల్టీస్టారర్.. మామూలుగా ఉండదు మరి..
మలయాళ బ్లాక్ బస్టర్ ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ తెలుగు రీమేక్‌లో రానా, బాలయ్య బాబు..

మలయాళ బ్లాక్ బస్టర్ ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ తెలుగు రీమేక్‌లో రానా, బాలయ్య బాబు..
నటసింహ నందమూరి బాలకృష్ణ.. రానా దగ్గుబాటి కలయికలో ఓ మల్టీస్టారర్ తెరకెక్కనుందనే వార్త ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతోంది. మలయాళ బ్లాక్ బస్టర్ రీమేక్ ‘అయ్యప్పనుమ్ కోశియమ్’ చిత్రాన్ని బాలయ్యతో చేయడానికి సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల మలయాళంలో ఘన విజయం సాధించిన ‘అయ్యప్పనుమ్ కోశియమ్’ సినిమా రీమేక్ హక్కులను ఈ సంస్థ తీసుకుంది.
అయ్యప్పనుమ్ నాయర్ అనే పోలీస్ ఆఫీసర్, రిటైర్డ్ హవాల్దార్ కోషి కురియన్ మధ్య నడిచే ఈగో వార్‌కి సంబంధించిన కథాంశంతో తెరకెక్కిన సినిమా ఇది. పోలీస్ అధికారిగా బిజు మీనన్, రిటైర్డ్ హవాల్దార్‌గా పృథ్వీరాజ్ అద్భుతంగా నటించారు. బిజు మీనన్ పాత్రను బాలయ్యతో చేయించాలని ఆయనకు సినిమా చూపించగా బాలయ్య ఆసక్తి కనబర్చినట్లు సమాచారం.
అలాగే పృథ్వీరాజ్ క్యారెక్టర్ కోసం రానాను సంప్రందించారని తెలుస్తోంది. మరో వైపు మంచు విష్ణు పేరు కూడా వినిపిస్తోంది. త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది. రానా, బాలయ్య కలిసి ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘మహానాయకుడు’ సినిమాలు చేశారు. రానా హోస్ట్ చేసిన ‘నెం.1 యారీ విత్ రానా’ షోలో బాలయ్య పాల్గొని సందడి చేసిన సంగతి తెలిసిందే.
Read Also : ట్రెడిషనల్ వేర్‌లో అదరగొట్టిన అనసూయ