Bhagavanth Kesari : భగవంత్ కేసరి ఫస్ట్ సింగల్ ప్రోమో రిలీజ్.. గణేష్ ఉత్సవాల్లో ఈసారి..
బాలయ్య నటిస్తున్న భగవంత్ కేసరి నుంచి ఫస్ట్ సింగల్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈసారి గణేష్ ఉత్సవాలకు తీన్మార్ సాంగ్ సిద్ధం అవుతుంది.

Balakrishna Bhagavanth Kesari first single Ganesh Anthem Promo release
Bhagavanth Kesari : నందమూరి బాలకృష్ణ (Balakrishna) నటిస్తున్న 108వ చిత్రం భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మూవీలో కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీలీల (Sreeleela) బాలయ్య కూతురిగా కనిపించనుందని సమాచారం. తాజాగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కి తెర లేపారు. ఈ మూవీ నుంచి మొదటి సాంగ్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్ధం చేశారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగల్ ప్రోమోని నేడు రిలీజ్ చేశారు.
Bhairava Dweepam : బాలయ్య అభిమానులకు బ్యాడ్‌న్యూస్.. ఆ సినిమా రీ రిలీజ్ మళ్లీ వాయిదా..
గణేష్ ఉత్సవాలు కోసం బాలయ్య ‘గణేష్ యాంతం’ని తీసుకు వస్తున్నాడు. ఈ సాంగ్ లో శ్రీలీల అండ్ బాలయ్య కలిసి తీన్మార్ ఆడనున్నారు. ప్రోమో చూస్తుంటే అభిమానులకు పూనకాలు వస్తున్నాయి. ఇక మోత సాంగ్ వస్తే.. డీజే బాక్స్ లు బద్దలు అవ్వడం ఖాయం అంటున్నారు. కాసర్ల శ్యామ్ ఈ పాటకి లిరిక్స్ అందించగా కరీముల్లా, మనీష్ పండ్రంకి పాడారు. శేఖర్ మాస్టర్ గ్రాండ్ విజువల్స్ తో డాన్స్ కోరియోగ్రఫీ చేశాడు. పూర్తి సాంగ్ ని సెప్టెంబర్ 1న రిలీజ్ చేయనున్నట్లు చెప్పారు.
Kalki 2898 AD : ప్రభాస్ ‘కల్కి’ సంక్రాంతికి వస్తుందా..? నిర్మాత అశ్వినీ దత్ ఏం చెప్పాడు..?
కాగా ఈ సినిమాని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. విలన్‌గా బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ (Arjun rampal) నటిస్తున్నాడు. దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. బాలయ్య గత చిత్రాలు అఖండ, వీర సింహరెడ్డి బాక్స్ ఆఫీస్ వద్ద 100 కోట్లకు పైగా వసూళ్లు చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. దీంతో ఈ మూవీ పై కూడా అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరి బాలయ్య హ్యాట్రిక్ హిట్టుని ఇస్తాడా..? లేదా..? చూడాలి.