Bhagavanth Kesari : భగవంత్ కేసరి జర్నీ వీడియో రిలీజ్.. బాలయ్య మాస్ డైలాగ్..

భగవంత్ కేసరి షూటింగ్ పూర్తి అయ్యింది. అందుకు సంబంధించిన ఒక జర్నీ వీడియోని చిత్ర యూనిట్ షేర్ చేశారు. ఆ వీడియోలో బాలయ్య చెప్పిన డైలాగ్..

Bhagavanth Kesari : భగవంత్ కేసరి జర్నీ వీడియో రిలీజ్.. బాలయ్య మాస్ డైలాగ్..

Balakrishna Bhagavanth Kesari shooting update video

Updated On : September 28, 2023 / 5:15 PM IST

Bhagavanth Kesari : నంద‌మూరి బాల‌కృష్ణ (Balakrishna) హీరోగా అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న మూవీ ‘భగవంత్ కేసరి’. ఇప్పటివరకు బాలకృష్ణని చూడని రోల్ లో ఈ సినిమాలో చూడబోతున్నారంటూ అనిల్ రావిపూడి చెప్పుకొస్తున్నాడు. కాజ‌ల్ అగ‌ర్వాల్‌ (Kajal Aggarwal), శ్రీలీల (Sreeleela), అర్జున్ రాంపాల్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ జర్నీ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక స్పెషల్ వీడియోని షేర్ చేశారు.

Siddharth : తన కొత్త సినిమా ప్రీమియర్స్‌కి వచ్చిన కలెక్షన్స్‌ని.. వాళ్ళ కంటి ఆపరేషన్స్ కోసం ఇచ్చిన సిద్ధార్థ్..

ఆ వీడియోలో షూటింగ్ మొదలైన దగ్గర నుంచి పూర్తి అయిన వరకు కొన్ని షాట్స్ చూపిస్తూ వచ్చారు. మొత్తం 8 నెలలు షూటింగ్, 24 లొకేషన్స్, 12 మాసివ్ సెట్స్ తో చిత్రీకరణ జరిగింది. అలాగే అక్టోబర్ 19న కచ్చితంగా వస్తున్నామంటూ కూడా తెలియజేశారు. ఇక ఈ వీడియోలో బాలకృష్ణ ఒక మాస్ డైలాగ్ చెప్పాడు. ‘గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే’ అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. మరి భగవంత్ కేసరి జర్నీ వీడియోని ఒకసారి మీరుకూడా చూసేయండి.

Suriya : అభిమాని మరణం.. ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించిన సూర్య..

కాగా ఈ సినిమాని సాహు గారపాటి, హరీష్ పెద్ది షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు ఒక సాంగ్, చిన్న గ్లింప్స్ ఆడియన్స్ ముందుకు వచ్చాయి. రెండు అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక త్వరలో ఈ మూవీ ట్రైలర్ అండ్ మిగిలిన అప్డేట్స్ కూడా ఆడియన్స్ ముందుకు తీసుకు రానున్నారు. థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.

బాలయ్య అఖండ, వీర సింహ‌రెడ్డి సినిమాలతో వరుస విజయాలు అందుకున్నాడు. ఇప్పుడు ఈ మూవీతో కూడా హిట్ కొట్టి హ్యాట్రిక్ ని సొంతం చేసుకోవాలని బాలయ్య చూస్తున్నాడు. ఈ మూవీ జైలర్ అండ్ విక్రమ్ తరహాలో ఉండబోతుందని తెలుస్తుంది. బాలయ్య తన కూతురు కోసం చేసే ఫైట్ ఈ మూవీ స్టోరీ అని సమాచారం.