Siddharth : తన కొత్త సినిమా ప్రీమియర్స్‌కి వచ్చిన కలెక్షన్స్‌ని.. వాళ్ళ కంటి ఆపరేషన్స్ కోసం ఇచ్చిన సిద్ధార్థ్..
తన కొత్త సినిమా ప్రీమియర్స్‌కి వచ్చిన కలెక్షన్స్‌ని హీరో సిద్దార్థ్.. వాళ్ళ కంటి ఆపరేషన్స్ కోసం డొనేట్ చేశాడు. ఇప్పుడు మాత్రం కాదు ఇక ముందు..

Siddharth donate his Chithha movie premier collections to NGO
Siddharth : తెలుగులో ఒకప్పుడు ఎన్నో సినిమాల్లో కనిపించిన సిద్దార్థ్.. ప్రస్తుతం తమిళంలో వరుస సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. తాజాగా ఈ హీరో నటించిన ఒక సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చింది. ‘చిత్తా’ అనే ఎమోషనల్ డ్రామాని సిద్దార్థ్ తన సొంత నిర్మాణ సంస్థ నిర్మించాడు. ఈ మూవీ కథ.. ఒక పాపకి, తన బాబాయ్ కి మధ్య ఉన్న బంధాన్ని చూపిస్తూ సాగుతుంది. నేడు ఈ మూవీ ఆడియన్స్ ముందుకు వచ్చింది. కాగా నిన్న ఒక చారిటీ కోసం స్పెషల్ పెయిడ్ ప్రీమియర్స్ వేశారు మూవీ టీం.
Suriya : అభిమాని మరణం.. ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించిన సూర్య..
‘ఐ రీసెర్చ్ సెంటర్’ ఎన్జీఓ కోసం ఈ ప్రీమియర్స్ వేశారు. వీరు 40వేల మంది పేదవారికి కంటి ఆపరేషన్ ఫ్రీగా చేశారు. ఇక వారికీ తనవంతు సహాయంగా ప్రీమియర్స్ కి వచ్చిన 10 లక్షల కలెక్షన్స్ ని సిద్దార్థ్.. ఆ ఎన్జీఓకి అందజేశాడు. అంతేకాదు ఇక నుంచి తన నిర్మాణ సంస్థలో ఏ ప్రాజెక్ట్ చేసినా.. వాటి నుంచి కూడా సహాయం అందజేస్తాను అంటూ ప్రకటించాడు. దీంతో సిద్దార్థ్ కి సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
Skanda 2 : స్కంద సీక్వెల్ అనౌన్స్ చేసిన బోయపాటి.. డ్యూయల్ రోల్‌తో రామ్..
View this post on Instagram
ఇక సిద్దార్థ్ ఇతర సినిమాల విషయానికి వస్తే.. తమిళంలో మరో రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. ఒకటి ‘టెస్ట్’ అనే మూవీ, మరొకటి ఇండియన్ 2 (Indian 2). కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ మూవీలో సిద్దార్థ్ ఒక ముఖ్య పాత్ర చేస్తున్నాడు. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ దాదాపు నాలుగేళ్ళ నుంచి షూటింగ్ జరుపుకుంటూనే వస్తుంది. అయితే రీసెంట్ గా ఈ సినిమా చిత్రీకరణ మొత్తం శంకర్ పూర్తి చేశాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. వచ్చే ఇది ఆగష్టులో ఈ సినిమా రిలీజ్ కానుందని తెలుస్తుంది.