Balayya – Boyapati : బాలయ్య – బోయపాటి నాలుగో సినిమా అప్డేట్.. ఆ రోజు మొదలు..

వీరిద్దరి కాంబోలో నాలుగో సినిమాగా BB4 వర్కింగ్ టైటిల్ తో ఓ పోస్టర్ రిలీజ్ చేసి సినిమాని అనౌన్స్ చేసారు.

Balayya – Boyapati : బాలయ్య – బోయపాటి నాలుగో సినిమా అప్డేట్.. ఆ రోజు మొదలు..

Balakrishna Boyapati Sreenu Fourth Movie BB4 Update on Dasara

Updated On : October 12, 2024 / 11:01 AM IST

Balayya – Boyapati : బాలయ్య – బోయపాటి శ్రీను అంటే ఆ సినిమా పక్కా హిట్ అవ్వాల్సిందే. వీళ్లిద్దరి కాంబో అంటే ఫ్యాన్స్ కి పండగే. బాలయ్య బోయపాటి కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ.. మూడు సినిమాలు ఒకదానికి మించి ఒకటి పెద్ద హిట్ అయ్యాయి. దీంతో ఈ కాంబో హ్యాట్రిక్ హిట్ కొట్టారు.

గతంలో ఈ కాంబోలో మరో సినిమా ఉంటుందని, అఖండ 2 కూడా ఉంటుందని ప్రకటించారు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో రామ్ ఆచంట – గోపీచంద్ ఆచంట నిర్మాతలుగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా గతంలో సినిమాని ప్రకటించారు. వీరిద్దరి కాంబోలో నాలుగో సినిమాగా BB4 వర్కింగ్ టైటిల్ తో ఓ పోస్టర్ రిలీజ్ చేసి సినిమాని అనౌన్స్ చేసారు.

Image

తాజాగా నేడు దసరా సందర్భంగా బాలయ్య బోయపాటి సినిమా అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమం అక్టోబర్ 16న చేస్తారని ప్రకటించారు. త్వరలోనే షూటింగ్ మొదలుపెడతారని సమాచారం. రిలీజ్ చేసిన పోస్టర్లో BB4 అని వర్కింగ్ టైటిల్ పెట్టి వెనుక అమ్మవారి ఫోటో పెట్టడంతో ఇది అఖండ 2 సినిమానేనా లేక వేరే సినిమానా అని ఆలోచిస్తున్నారు బాలయ్య ఫ్యాన్స్.