Daaku Maharaaj Collections : బాలయ్య ‘డాకు మహారాజ్’.. రెండు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?
నందమూరి నటసింహం నటించిన మూవీ డాకు మహారాజ్.

Balakrishna Daaku Maharaaj Movie two Days Collections
నందమూరి నటసింహం నటించిన మూవీ డాకు మహారాజ్. బాబీ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి ఆట నుంచే పాజిటివ్‌తో దూసుకుపోతుంది. రెండు రోజుల్లో ఈ చిత్రం రూ.74 కోట్లపైకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ విషయాన్ని చిత్ర బృందం తెలియజేసింది.
సంక్రాంతి బ్లాక్‌బస్టర్.. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది డాకు మహారాజ్ చిత్రం. రెండు రోజుల్లో రూ.74 కోట్లపైగా వసూళ్లను సాధించింది అని సోషల్ మీడియాలో ఓ కొత్త పోస్టర్ షేర్ చేస్తూ చిత్ర బృందం తెలిపింది. కాగా.. మొదటి రోజు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.56 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిన సంగతి తెలిసిందే.
అభిమానులకు కావాల్సిన యాక్షన్ తో పాటు ఎమోషన్ సీన్స్, మంచి మెసేజ్ కూడా ఉండటంతో ఈ మూవీకి ఫుల్ పాజిటివ్ టాక్ వస్తుంది. సినిమాపై ముందు నుంచి అంచనాలు ఉండటం, సంక్రాంతి హాలిడేస్ ఉండటంతో డాకు మహారాజ్ సినిమాకు బాగా కలిసొస్తుంది.
సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 80 కోట్లు జరిగింది. అంటే గ్రాస్ ఆల్మోస్ట్ 160 కోట్లకు పైగా కలెక్ట్ చేయాలి. రెండు రోజుల్లోనే 74 కోట్లు రావడంతో సంక్రాంతి హాలిడేస్ అయ్యేలోపే ఈజీగా బ్రేక్ ఈవెన్ అయి ప్రాఫిట్స్ లోకి వచ్చేస్తుందని భావిస్తున్నారు. దీంతో అఖండ, వీరసింహ రెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ తర్వాత ఇప్పుడు డాకు మహారాజ్ సినిమాతో మరో హిట్ కొట్టారు బాలయ్య.
The ultimate SANKRANTHI BLOCKBUSTER is winning hearts worldwide in every way! 🫶#DaakuMaharaaj ROARS with a MASSIVE ₹𝟕𝟒+ 𝐂𝐑𝐎𝐑𝐄𝐒 Worldwide Gross in 2 DAYS! ❤️🔥
Join the celebrations and witness the electrifying euphoria on the big screens NOW 🔥… pic.twitter.com/NRS1vulUw0
— Sithara Entertainments (@SitharaEnts) January 14, 2025