Balakrishna Family : బాలకృష్ణ ఫ్యామిలీ ఫోటో వైరల్.. ఢిల్లీలో పద్మ భూషణ్ అవార్డు అందుకునే ముందు.. ఫొటోలో ఎవరెవరు ఉన్నారంటే..?

బాలకృష్ణ ఫ్యామిలీ ఫోటో వైరల్ గా మారింది.

Balakrishna Family : బాలకృష్ణ ఫ్యామిలీ ఫోటో వైరల్.. ఢిల్లీలో పద్మ భూషణ్ అవార్డు అందుకునే ముందు.. ఫొటోలో ఎవరెవరు ఉన్నారంటే..?

Balakrishna Family Photo goes Viral from Delhi on Padma Awards Day

Updated On : April 28, 2025 / 9:10 PM IST

Balakrishna Family : నందమూరి బాలకృష్ణకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. నేడు పద్మ అవార్డుల ప్రధానం ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ లో ఘనంగా జరిగింది. రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. బాలకృష్ణ పంచెకట్టుతో తెలుగువాడిగా పద్మ భూషణ్ అవార్డు తీసుకున్నారు. బాలయ్య పద్మ భూషణ్ అవార్డు తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Also Read : Padma Awards 2025: పద్మవిభూషణ్ అందుకున్న డా.నాగేశ్వర్ రెడ్డి, పద్మభూషణ్ అందుకున్న బాలకృష్ణ.. ఘనంగా పద్మ పురస్కారాల ప్రదానోత్సవం..

ఈ క్రమంలో బాలకృష్ణ ఫ్యామిలీ ఫోటో వైరల్ గా మారింది. పద్మ భూషణ్ అవార్డు అందుకునే ముందు ఫ్యామిలీతో కలిసి రాష్ట్రపతి భవన్ ముందు ఫోటో దిగారు బాలయ్య. ఈ ఫొటోలో బాలకృష్ణ, భార్య వసుంధర, పెద్ద కూతురు బ్రాహ్మణి, అల్లుడు లోకేష్, మనవడు దేవాన్ష్, చిన్నకూతురు తేజస్విని, అల్లుడు భరత్, కొడుకు మోక్షజ్ఞ ఉన్నారు. ఇలా చాన్నాళ్ల తర్వాత బాలయ్య ఫ్యామిలీ అంతా ఒకే ఫొటోలో ఉండటంతో ఫ్యాన్స్ ఈ ఫోటోని వైరల్ చేస్తున్నారు.

Balakrishna Family Photo goes Viral from Delhi on Padma Awards Day

Also See : Padma Awards 2025: పద్మ అవార్డుల ప్రదానోత్సవం.. లైవ్

Balakrishna Family Photo goes Viral from Delhi on Padma Awards Day