Balakrishna: CMగా బాలయ్య.. కానీ టైమ్ పడుతుందట!
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ‘వీరసింహారరెడ్డి’ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్లలోకి వచ్చేస్తున్నాడు. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్ గ్లింప్స్, సాంగ్ ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి.

Balakrishna To Play CM In Parasuram Movie
Balakrishna: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ‘వీరసింహారరెడ్డి’ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్లలోకి వచ్చేస్తున్నాడు. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్ గ్లింప్స్, సాంగ్ ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి.
Balakrishna: బాలయ్య నెక్ట్స్ మూవీ షూటింగ్ ఆరోజే ప్రారంభం..?
సంక్రాంతి బరిలో వీరసింహారెడ్డి రిలీజ్ అవుతుండటంతో ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. కాగా, ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీని దర్శకుడు అనిల్ రావిపూడితో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. అయితే గతంలో మరో డైరెక్టర్ పరశురామ్ పెట్ల బాలయ్యతో ఓ సినిమా చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా బాలయ్య కోసం పరశురామ్ తెరకెక్కించబోయే సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. బాలయ్య కోసం పరశురామ్ ఓ పొలిటికల్ సబ్జెక్ట్ కథను రెడీ చేస్తున్నాడని.. ఈ సినిమాలో బాలయ్య సీఎం పాత్రలో నటిస్తాడని తెలుస్తోంది.
Balakrishna: సీక్వెల్ మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా మారుతున్న బాలయ్య…?
రియల్ లైఫ్‌లో ఎమ్మెల్యేగా ఉన్న బాలయ్యను సీఎం పాత్రలో చూస్తే, ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అవుతుందని పరశురామ్ భావిస్తున్నాడు. అందుకే ఆయన కోసం ఈ పొలిటికల్ సబ్జెక్ట్‌ను రెడీ చేస్తున్నాడట ఈ డైరెక్టర్. మరి నిజంగానే సీఎం పాత్రలో బాలయ్య ఎలా కనిపిస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ.. ఈ సినిమా పట్టాలెక్కాలంటే చాలా సమయం పడుతుందని సినీ వర్గాలు అంటున్నాయి. బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడితో సినిమా చేయాల్సి ఉంది. ఆ సినిమా తరువాత ‘ఆదిత్య 369’ సీక్వెల్‌ను పూర్తి చేయాలని బాలయ్య భావిస్తున్నాడు. ఈ రెండు ప్రాజెక్టుల తరువాతే పరశురామ్ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మరి సీఎంగా బాలయ్య ఎప్పుడు కనిపిస్తాడో చూడాలి.