Balakrishna vs Raviteja : పోటీలో మూడుసార్లు బాలయ్యపై రవితేజ విజయం.. మరి ఈసారి ఎవరిది పైచేయి?
ఇప్పటికే బాక్స్ ఆఫీస్ వద్ద మూడుసార్లు బాలయ్య పై విజయం సాధించిన రవితేజ.. ఇప్పుడు కూడా తనే గెలుపుని సొంతం చేసుకుంటాడు.

Balakrishna vs Raviteja at box office again with Bhagavanth Kesari Tiger Nageswara Rao
Balakrishna vs Raviteja : నటసింహ బాలకృష్ణ, మాస్ మహారాజ్ రవితేజ మరోసారి బాక్స్ ఆఫీస్ బరిలో పోటీకి దిగుతున్నారు. అయితే వీరిద్దరి మధ్య పోటీ ఏమి మొదటిసారి కాదు. ఇప్పటికి మూడుసార్లు వీరిద్దరూ బాక్స్ ఆఫీస్ వద్ద పోటీకి దిగగా ప్రతిసారి రవితేజనే గెలుస్తూ వచ్చాడు. ఇంతకీ వీరిద్దరి మధ్య పోటీ ఎప్పుడెప్పుడు జరిగింది. ఆ సినిమాలు ఏంటో ఒకసారి చూసేద్దాం రండి.
Chandramukhi 2 : ఎంఎం కీరవాణి లీక్స్.. చంద్రముఖి-2లో 10 పాటలు..!
మొదట వీరిద్దరూ కలిసి 2008 లో పోటీపడ్డారు. ‘ఒక్కమగాడు’ సినిమాతో భారీ అంచనాలు మధ్య ఆడియన్స్ ముందుకు వచ్చిన బాలకృష్ణ ప్లాప్ టాక్ ని సొంతం చేసుకున్నాడు. ఇక ఒక రోజు గ్యాప్ తో రవితేజ ‘కృష్ణ’ థియేటర్స్ లోకి రాగా సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ పోటీ అనంతరం నెక్స్ట్ ఇయర్ 2009 లోనే మరోసారి ఇద్దరు కలిసి బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటుకునేందుకు సిద్ధం అయ్యారు. బాలయ్య ‘మిత్రుడు’, రవితేజ ‘కిక్’ సినిమాలు రిలీజ్ కాగా ఆడియన్స్ మాస్ మహారాజ ఇచ్చిన కిక్ కి బాగా ఎంటర్టైన్ అయ్యారు.
ఆ తరువాత రెండేళ్ల గ్యాప్ తో మళ్ళీ బాక్స్ ఆఫీస్ బరిలో నిలిచారు. ఈసారి రవితేజ ‘మిరపకాయ్’ ఘాటుతో హ్యాట్రిక్ ని సొంతం చేసుకున్నాడు. ఆ మూవీతో పాటు వచ్చిన బాలయ్య ‘పరమవీరచక్ర’ రిజల్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మూడు చిత్రాలతో తరువాత మళ్ళీ ఈ ఏడాది బాలయ్య, రవితేజ పోటీ పడుతున్నారు. ఈ దసరాకి బాలకృష్ణ భగవంత్ కేసరి (Bhagavanth Kesari), రవితేజ టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao) చిత్రాలు ఒక రోజు వ్యవధిలో రిలీజ్ కాబోతున్నాయి. దీంతో రవితేజ అభిమానులు ఈసారి కూడా తమదే విజయం అంటుంటే, బాలయ్య ఫ్యాన్స్ ఈసారి మిస్ అయ్యేది లేదు అంటున్నారు. మరి చివరికి విజయం ఎవరిది అవుతుందో చూడాలి.