Srikanth Iyengar Issue: శ్రీకాంత్ అయ్యంగార్ ఇష్యూపై సినీ పెద్దలు స్పందించాలి.. వెంటనే చర్యలు తీసుకోవాలి: బల్మూరి వెంకట్

సినీనటుడు శ్రీకాంత్‌ అయ్యంగార్‌ మహాత్మాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు (Srikanth Iyengar Issue)చేశారని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ శనివారం సైబర్‌ సెల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

Srikanth Iyengar Issue: శ్రీకాంత్ అయ్యంగార్ ఇష్యూపై సినీ పెద్దలు స్పందించాలి.. వెంటనే చర్యలు తీసుకోవాలి: బల్మూరి వెంకట్

Balmuri Venkat filed a complaint in Maa association regarding the Srikanth Iyengar issue.

Updated On : October 12, 2025 / 12:45 PM IST

Srikanth Iyengar Issue: సినీనటుడు శ్రీకాంత్‌ అయ్యంగార్‌ మహాత్మాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ శనివారం సైబర్‌ సెల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన మా అసోసియేషన్ లో కూడా ఫిరాద్యు చేశారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ.. “వాక్‌ స్వతంత్రం పేరుతో హద్దులుమీరి మాట్లాడుతున్నారన్నారు. ఈ వ్యవహారంపై సినీ పెద్దలు(Srikanth Iyengar Issue) సైతం స్పందించాలి. శ్రీకాంత్ అయ్యంగార్ మా అసోసియేషన్ లో సభ్యుడిగా ఉన్నాడు. కాబట్టి, ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలి.

Sai Durga Tej: అల్లు అర్జున్ ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్.. నాకు చాలా గర్వంగా ఉంది: సాయి దుర్గ తేజ్

మహాత్మా గాంధీ గురించి సోషల్ మీడియాలో ఉద్దేశ్యపూర్వకంగానే ఆయన పోస్టులు పెడుతున్నాడు. ఎంతో మంది మనోభావాలు దెబ్బతినేలా ఆయన మాట్లాడుతున్నాడు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రజలు గ్రూపులుగా విడిపోయి కొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. సినిమా పెద్దలను కూడా మీరు కోరేది ఒక్కటే మీరు దీనిపై వెంటనే స్పందించాలి. ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి. లేదంటే, మేము యాంటీ బయోటిక్ గా మారాల్సి వస్తుంది. అంటూ ఘాటుగా స్పందించారు.

ఇక దీనిపై స్పందించిన మా జనరల్ సెక్రటరీ శివ బాలాజీ స్పందించారు. ఈరోజుల్లో ఫ్రీడం ఆఫ్ స్పీచ్ ఫ్యాషన్ అయిపొయింది. మాకు డిస్ప్లినరీ కమిటీ అనేది ఒకటి ఉంది. ఈ విషయం గురించి పూర్తిగా చర్చించి, కమిటీ మీటింగ్ పెట్టి త్వరలోనే చర్యలు తీసుకుంటాం అని తెలిపారు.