Bandi Sanjay : బలగం సినిమాపై బండి సంజయ్ కామెంట్స్..

తాజాగా బలగం సినిమాపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కామెంట్స్ చేశారు. తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో బండి సంజయ్ బలగం సినిమా గురించి మాట్లాడారు.

Bandi Sanjay : బలగం సినిమాపై బండి సంజయ్ కామెంట్స్..

Bandi Sanjay comments on Balagam Movie

Updated On : April 10, 2023 / 6:34 PM IST

Bandi Sanjay :  కమెడియన్ వేణు(Venu) దర్శకుడిగా మారి ప్రియదర్శి(Priyadarshi), కావ్య కళ్యాణ్ రామ్(Kavya Kalyan Ram) ముఖ్యపాత్రల్లో మానవ సంబంధాలు, కుటుంబ విలువలు కథాంశంతో తెరకెక్కించిన సినిమా బలగం(Balagam). దిల్ రాజు(Dil Raju) కూతురు హన్షిత రెడ్డి(Hanshitha Reddy) ఈ సినిమాని నిర్మించింది. చిన్న సినిమాగా రిలీజయి పెద్ద విజయం సాధించింది. కలెక్షన్స్ తో పాటు పేరు కూడా సంపాదించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాపై ప్రేక్షకులు, ప్రముఖుల నుంచి అభినందనలు వస్తున్నాయి. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు కూడా అందుకుంది బలగం సినిమా.

తాజాగా బలగం సినిమాపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కామెంట్స్ చేశారు. తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో బండి సంజయ్ బలగం సినిమా గురించి మాట్లాడుతూ.. మా నాయకులు, కార్యకర్తలతో బలగం సినిమా చూడటం చాలా ఆనందంగా ఉంది. బలగం సినిమా అద్భుతంగా ఉంది. నా పార్లమెంట్ పరిధిలోని దర్శకుడు వేణు ఈ సినిమా తీయడం గర్వంగా ఉంది. హిందూ సనాతన ధర్మంలోని గొప్పదనాన్ని ఈ చిత్రంలో చక్కగా చూపించారు. ఎవరైనా చనిపోతే 11 రోజులపాటు సంబురాలు చేసుకోవడం ప్రస్తుతం అలవాటుగా మారింది. కానీ ఆ పద్దతిని సంప్రదాయంగా చూపించిన దర్శకుడు వేణుకు హ్యాట్సాఫ్. పిట్టముట్టడం అనేది మన సంప్రదాయం. పిట్టముట్టుడు పద్దతిని చాలా సంప్రదాయంగా చూపించారు. నిర్మాతలు, దర్శకులు బలగం చిత్రాన్ని వ్యాపార కోణంలో తీయలేదని అర్థమవుతుంది. బలగం సినిమా ఓటీటీలో కాదు థియేటర్లలోనే చూడాలి అని అన్నారు.

Balagam Movie: మరో ఇంటర్నేషనల్ అవార్డును దక్కించుకున్న బలగం మూవీ

అలాగే బలగం సినిమాని తన పొలిటికల్ అంశాలకు కూడా ముడి పెట్టి మాట్లాడారు. బలగం సినిమాని రాజకీయాలకు ముడిపెడుతూ బండి సంజయ్.. కేసీఆర్ కు మానవ సంబంధాలు కాదు మనీ సంబంధాలే ఎక్కువయ్యాయి. రేవంత్ రెడ్డిని ఆయన కుమార్తె పెళ్లి సమయంలో అరెస్టు చేశారు. మా అత్త చనిపోయినప్పుడు పిట్ట ముట్టకుండానే నన్ను అరెస్టు చేశారు. ముఖ్యమంత్రిని కట్టేసి బలగం సినిమాను చూపించాలి. ముఖ్యమంత్రికి కనీస మానవత్వం లేదు. మానవత్వం లేని కేసీఆర్ కు బలగం చిత్రాన్ని అంకితం చేయాలి. వేణుకు ఈ సినిమా తీయాలనే ఆలోచన ఎలా వచ్చిందో తెలియదు కానీ తెలంగాణ సమాజం కోసం వేణు బలగం తీశాడు. దర్శకుడు వేణు, నటీనటులకు నా అభినందనలు అని అన్నారు. అలాగే ఈ ప్రెస్ మీట్ లో మరిన్ని రాజకీయ అంశాలపై మాట్లాడారు.