Parakramam : బోల్డ్ డైరెక్టర్ బండి సరోజ్ కుమార్ కొత్త సినిమా.. ‘పరాక్రమం’ ప్రీ టీజర్ రిలీజ్..

BSK మెయిన్ స్ట్రీమ్ పతాకంపై బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించబోతున చిత్రం "పరాక్రమం". ప్రస్తుతానికి ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.

Parakramam : బోల్డ్ డైరెక్టర్ బండి సరోజ్ కుమార్ కొత్త సినిమా.. ‘పరాక్రమం’ ప్రీ టీజర్ రిలీజ్..

Bandi Saroj Kumar Parakramam Movie Pre Teaser Released

Updated On : August 21, 2023 / 2:07 PM IST

Parakramam Movie : BSK మెయిన్ స్ట్రీమ్ పతాకంపై బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించబోతున చిత్రం “పరాక్రమం”. ప్రస్తుతానికి ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. సెప్టెంబర్ మరియు అక్టోబర్ మాసాల్లో రెండు షెడ్యూల్స్ లో ముప్పై రోజులో షూటింగ్ పూర్తి చేసి ఫిబ్రవరి 14, 2024లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా నేడు ఈ సినిమా ప్రీ టీజర్ విడుదల చేసారు.

దీనిపై దర్శకుడు బండి సరోజ్ కుమార్ మాట్లాడుతూ.. బండి సరోజ్ కుమార్ అనే నేను ఒక నటుడిగా, దర్శకుడిగా మీలో కొంత మందికి తెలిసే ఉండొచ్చు. “కళ నాది. వెల మీద” అనే కాన్సెప్ట్ తో, డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ లో రిలీజ్ చేసిన “నిర్బంధం, మాంగల్యం” లాంటి కల్ట్ సినిమాల్లో నాకు లక్షలాది ప్రేక్షకుల అభిమానం లభించింది. వాళ్ళు ఇచ్చిన బలంతో ఇప్పుడు నేను “BSK MAINSTREAM” అనే నా సొంత నిర్మాణ సంస్థ ద్వారా వెండితెరకు రాబోతున్నాను. పిల్లా, పాపలతో కుటుంబాలు సినిమా హాల్ కు తరలి వచ్చే కథాంశంతో “పరాక్రమం” అనే చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ” I,ME,MYSELF ” దీని టాగ్ లైన్ అని తెలిపాడు.

Bandi Saroj Kumar Parakramam Movie Pre Teaser Released

Theatrical Movies : ఈ వారం తెలుగులో రిలీజ్ అయ్యే థియేట్రికల్ సినిమాలు ఇవే..

అలాగే ఈ చిత్ర కథాంశం గురించి చెప్తూ.. గోదావరి జిల్లాల్లో “లంపకలోవ” గ్రామంలో పుట్టిన “లోవరాజు” అనే యువకుడి జీవితంలో జరిగే గల్లీ క్రికెట్, ప్రేమ, నాటక రంగ జీవితం, రాజకీయం లాంటి ఘట్టాల ఆవిష్కరణ ఈ చిత్ర ముఖ్య కథాంశం. యువతను అన్ని విధాలుగా ఎంటర్టైన్ చేస్తూనే, వారిని మేల్కొలిపే ఒక మంచి కమర్షియల్ మెసేజ్ కథతో రాబోతున్నాను. నాతోపాటు ప్రతిభ ఉన్న నూతన నటీ, నటులను ఈ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం చేయబోతున్నాను అని సరోజ్ కుమార్ తెలిపారు. ఈ సినిమాకు రచన, కూర్పు, సంగీతం, దర్శకత్వం అన్ని సరోజ్ కుమార్ నిర్వహిస్తుండటం విశేషం. ఇక ఈ సినిమాని తెలుగు, తమిళ్ లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు.