Bandla Ganesh : కాంగ్రెస్ విజయంతో నాకు విముక్తి లభించింది.. బండ్ల గణేష్ కామెంట్స్..

కాంగ్రెస్ విజయం సాధించడంతో ఐదేళ్ల నుంచి బాధ పడుతున్న తనకి విముక్తి లభించిందంటూ బండ్ల గణేష్ కామెంట్స్ చేశారు.

Bandla Ganesh : కాంగ్రెస్ విజయంతో నాకు విముక్తి లభించింది.. బండ్ల గణేష్ కామెంట్స్..

Bandla Ganesh comments about congress party victory gone viral

Bandla Ganesh : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగించింది. రేపే తెలంగాణకు కొత్త సీఎం, కొత్త ప్రభుత్వం రాబోతుంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ నాయకులకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ముందు నుంచి కాంగ్రెస్ ని సపోర్ట్ చేస్తూ వస్తున్న బండ్ల గణేష్.. ఈ విజయం పై ఎలా స్పందిస్తారో అని అందరిలో ఆసక్తి నెలకుంది. ఇటీవల బండ్ల గణేష్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ విజయం ఖాయం, ప్రమాణస్వీకారానికి సిద్ధంగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చారు.

ఇక నేడు కాంగ్రెస్ భారీ విజయం సాధించడంతో బండ్ల గణేష్ 10tvతో చేసిన కామెంట్స్ ఏంటంటే.. “బిఆర్ఎస్ ఓటమికి పూర్తి కారణం కేటీఆర్ మరియు కుటుంబ పాలనే. కాంగ్రెస్ గెలిచినందుకు చాలా సంతోషంతో ఉన్నాను. ఎందుకంటే ఐదేళ్లుగా 7’o క్లాక్ బండ్ల గణేష్ పేరుతో సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ కి మానసికంగా చాలా ఇబ్బంది పడ్డా. ఇపుడు నాకు పూర్తి విముక్తి లభించింది” అంటూ పేర్కొన్నారు.

అలాగే తనకి కూకట్‌పల్లి అభ్యర్థిగా పోటీ చేయమని ఆహ్వానం వచ్చిందని, కానీ తానే తిరస్కరించినట్లు వెల్లడించారు. ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది కదా అని.. తాను పోటీ చేయనందుకు పశ్చాతాపం పడడం లేదని పేర్కొన్నారు. ఇక ప్రకృతి కూడా కాంగ్రెస్ పాలన త్వరగా రావాలని కోరుకుంటుందని, అందుకే డిసెంబర్ 9 జరగాల్సిన ప్రమాణస్వీకారం రేపే (డిసెంబర్ 4) జరగుతుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

Also read : RGV – KTR : కేటీఆర్ పై ఆర్జీవీ ప్రశంస.. నేనెప్పుడూ మీలాంటి లీడర్‌ని చూడలేదు..

మరో పక్క ఆర్జీవీ చేసిన కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. ఈ విజయం కాంగ్రెస్‌ది కాదని రేవంత్ రెడ్డిదని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ బాహుబలి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేయాలని పేర్కొన్నారు. అలాగే తమ ఓటమిని పాజిటివ్ గా తీసుకున్న కేటీఆర్ గురించి కూడా మాట్లాడుతూ.. “నేను ఇప్పటివరకు ఓటమిని ఇంత పాజిటివ్ గా తీసుకున్న ఏ పొలిటికల్ లీడర్ ని నేను చూడలేదు. ఆ విషయంలో మీకు హ్యాట్సాఫ్” అంటూ కేటీఆర్ పై వర్మ ప్రశంసలు కురిపించారు.