Bandla Ganesh : బాలకృష్ణ హాస్పిటల్ ముందు.. బండ్లన్న అన్నదానం..

హైదరాబాద్(Hyderabad) లోని బాలకృష్ణ(Balakrishna) బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్(Basavatharakam Cancer Hospital) ముందు బండ్ల గణేష్ తన భార్య, మరికొంతమందితో కలిసి అన్నదానం నిర్వహించారు

Bandla Ganesh : బాలకృష్ణ హాస్పిటల్ ముందు.. బండ్లన్న అన్నదానం..

Bandla Ganesh Food Donation at Balakrishna Basavatharakam Cancer Hospital on Vinayaka Chavithi

Updated On : September 19, 2023 / 1:32 PM IST

Bandla Ganesh :  బండ్ల గణేష్ ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటారు. నటుడిగా, నిర్మాతగా కంటే కూడా తన స్పీచ్ లతో, ఇంటర్వ్యూలతో ఫుల్ ఫాలోయింగ్ తెచ్చుకున్న బండ్ల గణేష్ ట్విట్టర్లో కూడా రోజూ యాక్టివ్ గా ఉంటారు. ఓ పక్క పొలిటికల్ పోస్టులు షేర్ చేస్తూనే సినిమా పోస్టులు కూడా షేర్ చేస్తారు. ఆసక్తికర పోస్టులు పెడుతూ ఉంటారు. ప్రస్తుతానికి బండ్లన్న సినిమాలకు దూరంగా ఉన్నారు.

తాజాగా బండ్ల గణేష్ అన్నదానం నిర్వహించారు. హైదరాబాద్(Hyderabad) లోని బాలకృష్ణ(Balakrishna) బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్(Basavatharakam Cancer Hospital) ముందు బండ్ల గణేష్ తన భార్య, మరికొంతమందితో కలిసి అన్నదానం నిర్వహించారు. బసవతారకం హాస్పిటల్ తో బాలకృష్ణ ఎంతోమంది పేదలకు ఉచితంగా క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. దీంతో ఎంతోమంది పేదలు, వారి ఫ్యామిలీలు హాస్పిటల్ కి వస్తుంటారు. బసవతారకం హాస్పిటల్ బయట రోజు పేషంట్ తాలూకు మనుషులు, కొంతమంది అభాగ్యులు కూడా ఉంటారు.

Chiranjeevi Blood Bank : తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రులకు ఉచితంగా.. పేదల కోసం చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి రక్తం సరఫరా..

దీంతో పలువురు అక్కడ అన్నదానం నిర్వహిస్తూ ఉంటారు. అన్నదానం, వస్తువులు డొనేషన్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే నిన్న వినాయకచవితి సందర్భంగా బండ్లన్న అక్కడ ఉన్నవాళ్ళకి అన్నదానం చేశారు. ఆయనే స్వయంగా వడ్డించారు. ఈ వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేసి ఇలా అన్నదానం చేయడం ఎంతో ఆనందంగా ఉంది అని అన్నారు. దీంతో పలువురు బండ్లన్నని అభినందిస్తున్నారు.