Vakeelsaab: వకీల్‌సాబ్ ఈవెంట్లో నవ్వులు పూయించిన బండ్ల గణేశ్.. ఇది అంతకుమించి

నెలలు మాత్రమే కాదు.. ఏళ్ల గ్యాప్ తర్వాత సినీ.. కను విందు చేసేందుకు వచ్చేస్తుంది వకీల్ సాబ్. మహిళా ఔన్నత్యాన్ని చాటేవిధంగా..

Vakeelsaab: వకీల్‌సాబ్ ఈవెంట్లో నవ్వులు పూయించిన బండ్ల గణేశ్.. ఇది అంతకుమించి

Bandla Ganesh Speech In Vakeelsaab Event

Updated On : April 4, 2021 / 10:15 PM IST

Vakeelsaab: నెలలు మాత్రమే కాదు.. ఏళ్ల గ్యాప్ తర్వాత సినీ.. కను విందు చేసేందుకు వచ్చేస్తుంది వకీల్ సాబ్. మహిళా ఔన్నత్యాన్ని చాటేవిధంగా తీసిన సినిమాకు ఆడియో ఫంక్షన్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ ఈవెంట్ కు వచ్చిన బండ్ల గణేశ్.. స్టోరీ గురించి సినిమా గురించి మాట్లాడకుండా తాను పవన్ కళ్యాణ్ భక్తుడినని చెప్పుకుంటూ స్పీచ్ ఆసాంతం కామెడీగా సాగింది.

* ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా
* పవన్ కళ్యాణ్ ఒక వ్యసనం.. బూడిదయ్యేదాకా మనం వదలలేం.
* ఆయనకు సక్సెస్ అలవాటు అయింది. అదొక శకం మాత్రమే.
* ఊరకే రాదు.. కొందరు మాత్రమే చరిత్రలో నిలిచిపోతారు.
* హీరో దగ్గరకు వెళ్లి ఏదో మాయా చేయాలనుకుంటా. ఆ కళ్లలో నిజాయతీని చూసి మర్చిపోతా.
* నేను పవన్ కళ్యాణ్ భక్తుడినని గర్వంగా చెప్పుకుంటా.
* ఎయిర్‌పోర్టులో పవన్ గారూ అలా వెళ్లిపోతున్నారు అంత పొగరా అని మాట్లాడాడు. వాడికి పిలిచి ఇలా చెప్పా.
* అభినందన్ మీస కట్టుకి ఉన్నంత పొగరు ఉందని చెప్పా.
* భారత మాత ముద్దుబిడ్డ ఛత్రపతి శివాజీ కత్తి పవనానికి ఉన్నంత పొగరు ఉందని చెప్పా.
* బ్రిటీషుల పతనాన్ని శాసించి రెపరెపలాడిన త్రివర్ణ పతాకానికి ఉన్నంత పొగరుందని చెప్పా.
* నూనూగు మీసాల భగత్ సింగ్ పోరాటానికి ఉన్నంత పొగరుందని చెప్పా.
* త్రేతాయుగంలో పరశురాముడి గొడ్డలి పదునుకు ఉన్నంత పొగరుందని చెప్పా.
* లంకా యుద్ధంలో రామ బాణానికి ఉన్నంత పొగరు ఉందని చెప్పా.

ఈ స్పీచ్ జరుగుతున్నంత సేపు హీరో పవన్ కళ్యాణ్‌తో సహా నిర్మాత దిల్ రాజు, యాంకర్ సుమ, డైరక్టర్ వేణు శ్రీరామ్ లు అంతా నవ్వుతూనే ఉన్నారు. బండ్ల గణేశ్ స్టేజి ఎక్కినప్పటి నుంచి దిగేంత వరకూ ఫ్యాన్స్ అంతా ఈలలు చప్పుళ్లు వినిపిస్తూనే ఉన్నాయి.