Corona Positive: బండ్ల గణేష్ కు మళ్లీ కరోనా

సినీ నిర్మాత బండ్ల గణేష్ కు మరోసారి కరోనా సోకింది. గతేడాది కూడా గణేష్ కరోనా బారినపడి కోలుకున్నారు. ఇక తాజాగా మరోసారి కరోనా సోకింది. తాజాగా వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది

Corona Positive: బండ్ల గణేష్ కు మళ్లీ కరోనా

Corona Positive

Updated On : April 13, 2021 / 12:30 PM IST

Corona Positive: సినీ నిర్మాత బండ్ల గణేష్ కు మరోసారి కరోనా సోకింది. గతేడాది కూడా గణేష్ కరోనా బారినపడి కోలుకున్నారు. ఇక తాజాగా మరోసారి కరోనా సోకింది. తాజాగా వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కు బండ్ల గణేష్ వచ్చారు.

ఈ సమయంలోనే ఆయన కరోనా బారినపడినట్లు తెలుస్తుంది. ఈవెంట్ నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత జ్వరం, ఒళ్ళు నొప్పులులతో బాధపడ్డాడు. కానీ కరోనా అయి ఉండదనే ఆలోచనలో టెస్ట్ చేయించుకోలేదు. ఒళ్ళు నొప్పుల తీవ్రత ఎక్కువ కావడంతో సోమవారం సాయంత్రం కరోనా టెస్ట్ చేయించుకున్నాడు.

దీంతో ఆయనకు మరోసారి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అపోలో ఆసుపత్రికి వెళ్లారు. ప్రస్తుతం బండ్ల ఆరోగ్యాంగానే ఉన్నట్లు సమాచారం. తనను కలిసిన వారిని కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా బండ్ల గణేష్ కోరారు.

కాగా వకీల్ సాబ్ ఫంక్షన్ కు హాజరైన చాలా మందికి కోవిడ్ బయటపడుతోంది. హీరో పవన్, నిర్మాత దిల్ రాజు కూడా ఐసోలేషన్ లోకి వెళ్లారు.