Bandla Ganesh : నా రాజకీయ భవిష్యత్తుపై త్వరలో నిర్ణయం.. కర్ణాటక ఫలితాల వేళ బండ్ల గణేష్ సంచలన ట్వీట్స్..

గతంలో రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ లో చేరి కొన్ని రోజులు హడావిడి చేశారు. కాంగ్రెస్ తరపున MLA గా పోటీ చేద్దాం అనుకున్నాడు. కానీ కొన్ని అనివార్య కారణాలతో ఏకంగా రాజకీయాలకు గుడ్ బై చెప్పేశాడు బండ్ల గణేష్. గతంలోనే ఇక రాజకీయాల్లోకి రాను అని ప్రకటించాడు. కానీ తాజాగా బండ్ల గణేష్ చేసిన ట్వీట్స్ వైరల్ గా మారాయి.

Bandla Ganesh : నా రాజకీయ భవిష్యత్తుపై త్వరలో నిర్ణయం.. కర్ణాటక ఫలితాల వేళ బండ్ల గణేష్ సంచలన ట్వీట్స్..

Bandla Ganesh wants to enter politics again tweets goes viral

Updated On : May 13, 2023 / 1:33 PM IST

Bandla Ganesh : బండ్ల గణేష్.. ఒకప్పుడు నటుడిగా, నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత సినిమా ఈవెంట్స్ లో తన స్పీచ్ లతో, తన ఇంటర్వ్యూలతో, రాజకీయ ఇంటర్వ్యూలతో బాగా వైరల్ అయ్యారు. సోషల్ మీడియాలో బండ్ల గణేష్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బండ్ల్ గణేష్ కూడా ట్విట్టర్ లో రోజూ యాక్టివ్ గా ఉంటారు. పలుఅంశాలపై, సినిమాలపై పోస్టులు చేస్తూ ఉంటారు. ఒకప్పుడు నటుడిగా, నిర్మాతగా ఎన్నో హిట్స్ కొట్టిన బండ్లన్న ప్రస్తుతం సినిమాలకు దూరంగానే ఉంటున్నారు.

గతంలో రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ లో చేరి కొన్ని రోజులు హడావిడి చేశారు. కాంగ్రెస్ తరపున MLA గా పోటీ చేద్దాం అనుకున్నాడు. కానీ కొన్ని అనివార్య కారణాలతో ఏకంగా రాజకీయాలకు గుడ్ బై చెప్పేశాడు బండ్ల గణేష్. గతంలోనే ఇక రాజకీయాల్లోకి రాను అని ప్రకటించాడు. కానీ తాజాగా బండ్ల గణేష్ చేసిన ట్వీట్స్ వైరల్ గా మారాయి.

బండ్ల గణేష్ తన ట్విట్టర్ లో.. నా రాజకీయ భవిష్యత్తుపై త్వరలో నిర్ణయం. నీతిగా, నిజాయితీగా, నిబద్ధతగా, ధైర్యంగా, పౌరుషంగా, పొగరుగా రాజకీయాలు చేస్తా. బానిసత్వానికి బాయ్ బాయ్, నిజాయితీతో కూడిన రాజకీయాలకి జై జై. రాజకీయాలంటే నిజాయితీ, రాజకీయాలంటే నీతి, రాజకీయాలంటే కష్టం, రాజకీయాలంటే పౌరుషం, రాజకీయాలంటే శ్రమ, రాజకీయాలంటే పోరాటం.. ఇవన్నీ ఉంటేనే రాజకీయాల్లోకి చేరాలి రావాలి అందుకే వస్తా అని ట్వీట్ చేశారు.

Yathindra Siddaramaiah : మా నాన్నే మరోసారి సీఎం కావాలి..ఎందుకంటే : సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర

ఓ పక్క కర్ణాటక ఫలితాలు ఉన్న సమయంలో బండ్ల గణేష్ ఇలా ట్వీట్స్ చేయడం సంచలనంగా మారింది. మరి మళ్ళీ కాంగ్రెస్ లోకి బండ్ల గణేష్ వస్తాడా అని అనుకుంటున్నారు. కానీ అతను పెట్టిన ట్వీట్స్ ని బట్టి, అలాగే అతను పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని కాబట్టి జనసేనలోకి కూడా వచ్చే అవకాశం ఉంది అంటున్నారు నెటిజన్లు. తెలంగాణలో 2023 ఎలక్షన్స్ ఉండటంతో మరి ఈ సారి ఏ పార్టీలో బండ్ల గణేష్ చేరుతాడు? తన షాద్ నగర్ నుంచి పోటీ చేస్తాడా? తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.