Bappi Lahiri : ముగిసిన బప్పీ లహరి అంత్యక్రియలు
పాశ్చ్యాత్య సంగీత బాణీని ఇండియాకు తీసుకొచ్చి అందులో ప్రయోగాలు చేసి.. డిస్కో మ్యూజిక్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారి.. డిస్కో కింగ్‌గా పేరు తెచ్చుకున్నారు బప్పీ లహరి...

Bappi Lahari
Bappi Lahiri Funeral : భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన కంటూ ఓ అధ్యాయాన్ని లిఖించుకున్న బప్పీ లహరి అంత్యక్రియలు బంధుమిత్రులు, అభిమానుల మధ్య ముంబైలోని పవన్ హన్స్ శ్మశాన వాటికలో జరిగాయి. చివరిసారి ఆయనకు నివాళులు అర్పించేందుకు సన్నిహితులు, సినీ ప్రముఖులు, అభిమానులు తరలివచ్చారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న తుదిశ్వాస విడిచారు. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా నివాళులు అర్పించింది. అమెరికా నుంచి వచ్చిన ఆయన కుమారుడు బప్పీ లహరి చితికి నిప్పంటించి అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
Read More : బప్పీ లహరి కన్నుమూత.. స్పెషల్ స్టోరీ
పాశ్చ్యాత్య సంగీత బాణీని ఇండియాకు తీసుకొచ్చి అందులో ప్రయోగాలు చేసి.. డిస్కో మ్యూజిక్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారి.. డిస్కో కింగ్‌గా పేరు తెచ్చుకున్నారు బప్పీ లహరి. 1980లో మిథున్ చక్రవర్తి హీరోగా వచ్చిన డిస్కో డాన్సర్ సినిమాలోని పాటలు యావత్ భారతదేశపు యువతరాన్నీ ఒక ఊపు ఊపాయంటే కారణం బప్పీ లహరి మ్యూజిక్. ఆ పాటతో ఇండియన్ స్క్రీన్ మీద కొత్త ట్రెండ్ క్రియేట్ చేసారు. అలా సంగీత ప్రేమికులను, కుర్రకారును తన డిస్కో పాటలతో ఉర్రూతలూగించారు. డిస్కో డాన్సర్ మూవీకి గాను చైనా నుండి ఫస్ట్ టైమ్ అవార్డ్ తీసుకున్న మొదటి మ్యూజిక్ డైరెక్టర్ బప్పీ లహరి. తెలుగులోనూ టాప్ హీరోలందరికీ సూపర్ హిట్స్ ఇచ్చి ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు బప్పీలహరి.
Read More : Obstructive Sleep Apnea: బప్పీలహరి ఈ జబ్బు కారణంగానే మృతి చెందారు, మీరు తెలుసుకోండి
డిస్కో కింగ్‌గా పేరు తెచ్చుకున్న బప్పీలహరి అసలు పేరు అలోకేష్ లహరి. 1952 నవంబర్ 27న బెంగాల్‌లో జన్మించారు. బప్పీదా తండ్రి అపరేశ్ లహరి, తల్లి బనారసీ లహరి బెంగాల్‌లో ఫేమస్ సింగర్స్. దీంతో చిన్న వయసులో సంగీతాన్ని అవసాన పట్టేశారు బప్పీదా. మూడేళ్ల వయసులోనే తబలా నేర్చుకున్నారు. కిషోర్ కుమార్‌కు ఆయన దగ్గరి బంధువు. 19 ఏళ్ల వయసులోనే తన మ్యూజిక్ కెరీర్‌ను ప్రారంభించిన బప్పీలహరి..5 వేలకు పైగా పాటలను ట్యూన్ చేశారు. డిస్కో డ్యాన్సర్ హిందీ సినిమాతో సినీ అభిమానులను ఉర్రూతలూగించారు.