Obstructive Sleep Apnea: బప్పీలహరి ఈ జబ్బు కారణంగానే మృతి చెందారు, మీరు తెలుసుకోండి

బప్పి లహరి.. మృతికి అసలు కారణం అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (OSA) అనే రుగ్మతగా వైద్యులు తేల్చారు. ఈ అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా కారణంగా గుండె ఆగి బప్పి లహరి మృతి చెందారు

Obstructive Sleep Apnea: బప్పీలహరి ఈ జబ్బు కారణంగానే మృతి చెందారు, మీరు తెలుసుకోండి

Osa

Obstructive Sleep Apnea: ప్రముఖ సంగీత దర్శకుడు బప్పి లహిరి(69) అనారోగ్యం కారణంగా మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని క్రిటి కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందారు. బప్పి లహరి మరణ వార్త విని ప్రపంచ వ్యాప్తంగా ఆయన అభిమానులు, సంగీత ప్రియులు విచారం వ్యక్తం చేశారు. కాగా, గత కొంతకాలంగా పలు శారీరక రుగ్మతలతో బాధపడుతున్న బప్పి లహరి.. మృతికి అసలు కారణం అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (OSA) అనే రుగ్మతగా వైద్యులు తేల్చారు. ఈ అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా కారణంగా గుండె ఆగి బప్పి లహరి మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. మనుషుల్లో సర్వసాధారణంగానే అనిపించే నిద్ర సంబంధిత జబ్బు “స్లీప్ అప్నియా”గానే దీన్ని గుర్తించినా, ఇది ఎంత ప్రమాదకరమో..తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Also read: COVID 19 : తెలంగాణలో కరోనా, 24 గంటల్లో 512 కేసులు

ఏమిటీ అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (OSA): కొందరు మనుషులు నిద్రలో ఉన్నపుడు.. ఒక్కోసారి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటారు. అకస్మాత్తుగా లేచి గాలి తీసుకుంటారు. దీన్నే స్లీప్ అప్నియా అని పిలుస్తారు. ఇది సర్వసాధారణమే అయినప్పటికీ, పలు సందర్భాల్లో మనిషి రక్తపోటును పెంచి, గుండె ఆగిపోయే పరిస్థితులు తలెత్తుతాయని వైద్యులు అంటున్నారు. రుగ్మత తీవ్రతను భట్టి ఈ స్లీప్ అప్నియాను.. అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా, సెంట్రల్ స్లీప్ అప్నియా, కాంప్లెక్స్ స్లీప్ అప్నియా అని మూడు రకాలుగా పేర్కొన్నారు. వీటిలో అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా మనుషుల్లో శ్వాశ సంబంధమైన రుగ్మతలకు దారితీస్తుంది.

Osa

Osa

ఈ రుగ్మత ఉన్న వారు నిద్రపోతున్న సమయంలో..ఎగువ వాయు నాళాలు కుచించుకుపోతాయి. దీంతో శరీరం శ్వాస పీల్చుకోవడం అనే క్రియను ఆపేస్తుంది. అయితే ఆ నాళాలను వ్యాకోచింపచేసి శరీరంలోకి గాలి పంపిణీ చేసే క్రమంలో ఛాతీ కండరాలపై ఒత్తిడి పడుతుంది. ఈక్రమంలో నిద్రిస్తున్న వ్యక్తి ఒక్కసారిగా లేచి గట్టిగా శ్వాస తీసుకునేందుకు ప్రయత్నిస్తారు. అమెరికాకు చెందిన “సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్” పరిశోధన ప్రకారం, స్లీప్ అప్నియా ఉన్న వ్యక్తులు క్రమానుగతంగా ఊపిరి పీల్చుకోవడం లేదా “అధిక గురక” శబ్దాలు చేస్తారు. ఈ సమయంలో వారి నిద్రకు అంతరాయం కలుగుతుంది. దీంతో వారు ఎక్కువగా పగటి సమయంలో నిద్ర పోవాల్సి వస్తుంది.

Also read: Abdomen Tumor: మహిళ కడుపులోని 47కేజీల ట్యూమర్ తొలగించిన వైద్యులు

ఈ అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా సమస్య ఉన్నవారిలో గొంతు భాగంలోని వెనుక కండరాలు విశ్రాంతి కోరుకుంటూ సాధారణ శ్వాసను పంపిణీ చేయలేవు. ఇది శ్వాసనాళాలుపై ప్రభావం చూపి శ్వాసను 10 సెకన్ల పాటు అడ్డుకుంటుంది. ఇది జరిగినప్పుడు, రక్తంలో ఆక్సిజన్ స్థాయి తగ్గి, కార్బన్ డయాక్సైడ్ శాతం పెరుగుతుంది. దీంతో మనిషి మెదడు అప్రమత్తమై ఆందోళన సంకేతాలను స్పృశించి, కొద్దిసేపు నిద్ర నుండి మేల్కొల్పుతుంది. కేవలం క్షణకాలం పాటు జరిగే ఈ చర్యను సాధారణంగా గుర్తించలేకపోవడమే అతి పెద్ద సమస్య. ఇటివంటి సమస్య ఉన్నవారిలో దీర్ఘకాలంలో తీవ్ర నష్టం వాటిల్లుతుందని నిపుణులు చెబుతున్నారు.

అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (OSA) లక్షణాలు:

* పగటిపూట ఎక్కువ నిద్రపోవడం
* పెద్దగా గురక పెట్టడం
* నోరు ఎండిపోవడం లేదా గొంతు నొప్పితో మేల్కొనడం
* ఉదయం నిద్రలేవడంతోనే తలనొప్పి
* నిస్పృహ లేదా చిరాకు వంటి మానసిక స్థితి మార్పులు
* అధిక రక్త పోటు
* హృదయ సంబంధ సమస్యలు
* కంటి పరిస్థితులలో మార్పులు
* అధిక అలసట వంటి అనేక సమస్యలు కూడా ఈ OSA యొక్క లక్షణాలుగా వైద్యులు పేర్కొన్నారు.

Tonsil

Tonsil

ఈ అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (OSA)కు చికిత్స ఉందా?:అరుదైన సందర్భాల్లో మనుషుల ప్రాణానికే ప్రమాదమైన ఈ అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (OSA)కు చికిత్స ఉందని వైద్యులు, పరిశోధకులు వెల్లడించారు. రుగ్మతను గుర్తించగలిగితే వెంటనే వైద్యులను సంప్రదించి దీన్నుంచి బయటపడొచ్చు. మరీ పరిస్థితి తీవ్రంగా ఉంటే.. కొన్ని చికిత్స పద్ధతులు ఉన్నాయని హార్వర్డ్ పరిశోధకులు పేర్కొన్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. OSA చికిత్స కోసం అత్యంత సాధారణ చికిత్సలలో ఒకటిగా CPAP (నిరంతర సానుకూల శ్వాసనాళ ఒత్తిడి)ని ప్రయోగిస్తారు. CPAP అనేది అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియాతో బాధపడుతున్న వ్యక్తి యొక్క ముక్కు మరియు నోటికి పెట్టె ఒక పైపు లాంటి పరికరం. ఇది రాత్రిపూట నిద్రించే సమయంలో శ్వాస రంద్రాలు తెరిచి ఉంచి, వాయు మార్గాలలోకి తేలికగా గాలిని పంపిణీ చేస్తుంది. CPAPకి మరొక ప్రత్యామ్నాయం నోటికి సరిపోయే ఒక ప్లాస్టిక్ ఇన్సర్ట్. దీన్ని నోటిలో పెట్టుకోవడంతో నాలుకకు, వాయుమార్గాల మధ్యనున్న కణజాలాలు మూసుకుపోకుండా నిరోధిస్తుంది. దీంతో నిద్రించే వ్యక్తి తేలికగా శ్వాస తీసుకోగలడు. పరిస్థితి తీవ్రతరమైతే శస్త్రచికిత్స కూడా చేయాల్సి ఉంటుందని వైద్యులు అంటున్నారు.

Osa

Osa