NTR : ఎవరైనా డ్రగ్స్ వాడితే వాళ్లకు ఫిర్యాదు చేయండి.. ఎన్టీఆర్ వీడియో వైరల్..

ఎన్టీఆర్ స్వయంగా డ్రగ్స్ కి వ్యతిరేకంగా ఓ వీడియో చేసి రిలీజ్ చేశారు.

NTR : ఎవరైనా డ్రగ్స్ వాడితే వాళ్లకు ఫిర్యాదు చేయండి.. ఎన్టీఆర్ వీడియో వైరల్..

Updated On : September 25, 2024 / 11:32 AM IST

NTR : ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సినిమా వాళ్ళు డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో పాల్గొనాలని, తమ సినిమాలకు రేట్లు పెంచాలంటే, ఎక్స్ ట్రా బెనిఫిట్స్ కావాలంటే ఆ సినిమాలో నటించిన ముఖ్య నటులతో డ్రగ్స్ కి వ్యతిరేకంగా వీడియోలు చేయాలని కండిషన్ పెట్టారు.

ఎన్టీఆర్ దేవర సినిమాతో వస్తుండటంతో ఈ సినిమాకు టికెట్ రేట్లు పెంపు, ఎక్స్ ట్రా షోలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో ఎన్టీఆర్ స్వయంగా డ్రగ్స్ కి వ్యతిరేకంగా ఓ వీడియో చేసి రిలీజ్ చేశారు.

Also Read : Shruti Marathe : ‘దేవర’లో ఎన్టీఆర్ భార్య పాత్రలో నటించే ఈ హీరోయిన్ ఎవరో తెలుసా? యంగ్, ముసలి పాత్రల్లో..

ఈ వీడియోలో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. మన దేశ భవిష్యత్తు మన యువత చేతుల్లోనే ఉంది. కానీ కొంతమంది తాత్కాలిక ఆనందం కోసమో, క్షణికమైన ఒత్తిడి నుంచి బయటపడటం కోసమో, సహచరుల ప్రభావం వల్లనో, స్టైల్ అనో మాదక ద్రవ్యాల బారిన పడటం చాలా బాధాకరం. జీవితం అన్నింటికంటే విలువైనది. రండి, నాతో చేతులు కలపండి. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామ్యులు అవ్వండి. మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ అమ్మటం కానీ, కొనటం కానీ వినియోగించటం కానీ చేస్తుంటే వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో 8712671111 కు కాల్ చేసి సమాచారం అందించండి అని తెలిపారు.