Bellamkonda Sreenivas: పవన్ డైరెక్టర్‌తో బెల్లంకొండ శ్రీనివాస్ మూవీ.. నిజమేనా?

టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తన లాస్ట్ మూవీ ‘అల్లుడు అదుర్స్’ను 2021లో రిలీజ్ చేశాడు. ఆ తరువాత మరొక తెలుగు సినిమాను ఇప్పటివరకు ఆయన రిలీజ్ చేయలేదు. అయితే, బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు ఈ హీరో రెడీ అయిన సంగతి తెలిసిందే. ప్రభాస్ నటించిన ‘ఛత్రపతి’ సినిమాను దర్శకుడు వివి.వినాయక్ డైరెక్షన్‌లో హిందీ రీమేక్ చేస్తున్నాడు ఈ హీరో. ఇక ఈ సినిమాను త్వరలోనే బాలీవుడ్‌లో రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

Bellamkonda Sreenivas: పవన్ డైరెక్టర్‌తో బెల్లంకొండ శ్రీనివాస్ మూవీ.. నిజమేనా?

Bellamkonda Sreenivas Next Movie With Sagar Chandra

Updated On : February 11, 2023 / 9:40 PM IST

Bellamkonda Sreenivas: టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తన లాస్ట్ మూవీ ‘అల్లుడు అదుర్స్’ను 2021లో రిలీజ్ చేశాడు. ఆ తరువాత మరొక తెలుగు సినిమాను ఇప్పటివరకు ఆయన రిలీజ్ చేయలేదు. అయితే, బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు ఈ హీరో రెడీ అయిన సంగతి తెలిసిందే. ప్రభాస్ నటించిన ‘ఛత్రపతి’ సినిమాను దర్శకుడు వివి.వినాయక్ డైరెక్షన్‌లో హిందీ రీమేక్ చేస్తున్నాడు ఈ హీరో. ఇక ఈ సినిమాను త్వరలోనే బాలీవుడ్‌లో రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

Bellamkonda Sreenivas : బెల్లం బాబు.. బాలీవుడ్ తర్వాత హాలీవుడ్.. ‘సుఖీభవ.. సుఖీభవ’..

కాగా, ఇప్పుడు మళ్లీ టాలీవుడ్‌లో తన సినిమాల జోరును పెంచేందుకు రెడీ అవుతున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఈ క్రమంలోనే పలువురు డైరెక్టర్లు చెబుతున్న కథలను వింటున్నాడట. అయితే పవన్ కల్యాణ్‌కు ‘భీమ్లా నాయక్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని అందించిన యంగ్ డైరెక్టర్ సాగర్ చంద్ర చెప్పిన ఓ కథకు బెల్లంకొండ శ్రీనివాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ కాంబినేషన్ గురించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా రాబోతుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అంతేగాక ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ ప్రొడ్యూస్ చేయనుందని తెలుస్తోంది.

Bellamkonda Srinivas : రీమేక్‌లు నాకు మైసూర్ పాక్‌లు అంటున్న బెల్లం బాబు..

మరి నిజంగానే భీమ్లా నాయక్ డైరెక్టర్ బెల్లంకొండ శ్రీనివాస్‌తో సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడా.. వీరి కాంబినేషన్‌లో ఎలాంటి సినిమా రాబోతుందా అనే ఆసక్తి ప్రస్తుతం సినీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ నెలకొంది.