Bellamkonda Srinivas : రీమేక్‌లు నాకు మైసూర్ పాక్‌లు అంటున్న బెల్లం బాబు..

తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన ‘కర్ణన్‌’ సినిమా ఏప్రిల్‌ 9న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తెలుగు రీమేక్‌ హక్కులను బెల్లంకొండ సురేష్‌ దక్కించుకున్నారు..

Bellamkonda Srinivas : రీమేక్‌లు నాకు మైసూర్ పాక్‌లు అంటున్న బెల్లం బాబు..

Bellamkonda Srinivas

Updated On : April 30, 2021 / 4:57 PM IST

Bellamkonda Srinivas: ‘అల్లుడు శీను’ అంటూ గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్, తమిళ్ సినిమా ‘రాక్షసన్‌’ తెలుగు రీమేక్ ‘రాక్షసుడు’ తో సరైన సూపర్ హిట్ కొట్టాడు. ప్రస్తుతం బాలీవుడ్‌లో ప్రభాస్ – రాజమౌళిల ‘ఛత్రపతి’ రీమేక్‌లో నటిస్తున్నాడు.

ఇంతలోనే మరో రీమేక్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు బెల్లం బాబు.. తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన ‘కర్ణన్‌’ సినిమా ఏప్రిల్‌ 9న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తెలుగు రీమేక్‌ హక్కులను బెల్లంకొండ సురేష్‌ దక్కించుకున్నారు. త్వరలోనే తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్‌తో ఈ సినిమాను రీమేక్‌ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు..

తమిళంలో ‘కర్ణన్‌’ సినిమాను మారి సెల్వరాజ్‌ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత, వి క్రియేషన్స్ అధినేత కలైపులి ఎస్ థాను నిర్మించారు.. హిందీ ‘ఛత్రపతి’ పూర్తయిన తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ నటించబోయే ‘కర్ణన్’ తెలుగు రీమేక్ షూటింగ్ స్టార్ట్ కానుంది..