Bhanu chandar : అతను దేశం గర్వించే దర్శకుడు అవుతాడని 20 ఏళ్ళ క్రితమే చెప్పాను
రాజమౌళి గురించి మాట్లాడుతూ భానుచందర్.. ''నేను రాజమౌళితో ‘సింహాద్రి’ సినిమా చేసినప్పుడు అయన గురించి ఇంటర్వ్యూలలో చెప్పాను. నా డబ్బింగ్ సమయంలో ఆయనను పిలిచి...............

Rajamouli
Rajamouli : ఒకప్పటి హీరో, ఒకప్పటి ప్రముఖ సంగీత దర్శకుడు మాస్టర్ వేణు కుమారుడు భానుచందర్ తెలుగు, తమిళ్ లో ఎన్నో హిట్ సినిమాలతో మెప్పించారు. యాక్షన్, క్లాసిక్ సినిమాలు ఎన్నో తీశారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, సంగీత దర్శకుడిగా, నిర్మాతగా సినిమాలు చేశారు. ప్రస్తుతం 70 ఏళ్ళ వయసులో అప్పుడప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో, ఈవెంట్స్ లలో కనిపిస్తున్నారు. తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలని తెలిపారు భాను చందర్.
Sudeep : హిందీ నేషనల్ లాంగ్వేజ్ కాదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన స్టార్ హీరో
భాను చందర్ రాజమౌళి గురించి మాట్లాడుతూ అయన దేశం గర్వించదగ్గ దర్శకుడవుతాడని 20 ఏళ్ళ క్రితమే చెప్పాను అన్నారు. రాజమౌళి గురించి మాట్లాడుతూ భానుచందర్.. ”నేను రాజమౌళితో ‘సింహాద్రి’ సినిమా చేసినప్పుడు అయన గురించి ఇంటర్వ్యూలలో చెప్పాను. నా డబ్బింగ్ సమయంలో ఆయనను పిలిచి ఈ సినిమా తర్వాత నేను మీకు ఫోన్ చేస్తాను కానీ మీరు అందుబాటులోకి రారు. సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. మీరు దేశం గర్వించే గొప్ప దర్శకులు అవుతారు అని చెప్పాను. ఇప్పుడు అలాగే జరిగింది. రాజమౌళి గురించి దేశమంతటా మాట్లాడుకుంటున్నారు. రాజమౌళి దగ్గర్నుంచి సినిమా తీయడం ఒక్కటే కాదు, ప్రచారం చేయడం, హిట్ చేయడం లాంటివి కూడా చాలా మంది నేర్చుకోవాలి. రాజమౌళి మట్టిని చాక్లెట్ పేపర్‌లో పెట్టి వండర్‌ఫుల్ చాక్లెట్ అని అమ్మగలడు. ఇలా ఎంతమంది చేయగలరు. ఎవరు పడితే వాళ్లు చేయలేరు. దానికి ప్రత్యేక నైపుణ్యం ఉండాలి. అది రాజమౌళిలో చాలా ఉంది” అని అన్నారు.