బాగానే కష్ట పడుతుంది.. ప్రతిఫలం ఎప్పుడో మరి!
పాపులర్ టీవీ, సినీ నటి భానుశ్రీ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

పాపులర్ టీవీ, సినీ నటి భానుశ్రీ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..
టీవీ సీరియల్స్, సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తెలుగమ్మాయి భానుశ్రీ. బిగ్ బాస్-2 రియాల్టీ షో తో మరింత పాపులర్ అయిందామె. తాజాగా భానుశ్రీ పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..
తనకి తానే గురువు..
భానుశ్రీ తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో పుట్టింది. తల్లిదండ్రులకు ఒక్కగానొక్క సంతానం. స్కూలింగ్ అంతా అక్కడే సాగింది. బంధువులు కొంతమంది టాలీవుడ్‌లో డ్యాన్సర్స్‌గా పనిచేస్తుండటంతో తనకు కూడా ఇండస్ట్రీకి వెళ్లాలనే కోరిక మొదలైంది. దీంతో టీవీలో చూస్తూ సొంతగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేది. అలా డ్యాన్స్ అబ్బింది. డిగ్రీ పూర్తయ్యాక హన్మకొండలో కొన్నాళ్లు ప్రభుత్వ ఆరోగ్యశాఖలో పనిచేసింది. ఆమె తండ్రి కూడా ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు.
డ్యాన్సర్‌గా టాలీవుడ్ ఎంట్రీ..
తర్వాత టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి డ్యాన్సర్‌గా కొనసాగుతుండగా భానుశ్రీకి ప్రముఖ టీవీ ఛానల్‌లో సీరియల్‌లో నటించే అవకాశం వచ్చింది. అలా ‘జాబిలమ్మ’ సీరియల్‌లో అమాయకురాలైన ఆడపిల్ల పాత్రలో, ఇద్దరు చెల్లెళ్ళకు అక్కగా 250 ఎపిసోడ్స్‌లో నటించి ప్రేక్షకుల్లో మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ‘సీతాకోక చిలుక’ సీరియల్లో నెగిటివ్ రోల్ చేసింది. ఓ వైపు సీరియల్స్ చేస్తూనే, సినిమాల్లో కూడా నటించేది భానుశ్రీ.
Read Also : టీ షర్ట్ ఇలా కూడా వేసుకుంటారా?.. రకుల్ సరికొత్త చాలెంజ్..
‘బాహుబలి’ భానుశ్రీ..
తెలుగుచిత్ర పరిశ్రమకు ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చిన ‘బాహుబలి’ చిత్రంలో తమన్నాతో కలిసి నటించిన భానుశ్రీ.. అంతకుముందు ‘కుమారి 21F’, ‘ఇద్దరి మధ్య 18’ సినిమాలో హీరోయిన్‌గా, ‘మహానుభావుడు’, ‘గుంటూరోడు’ చిత్రాల్లో నటించింది. ‘ఏడు చేపలకథ’ వంటి రొమాంటిక్ కామెడీ మూవీలో బోల్డ్‌గా నటించి ఆకట్టుకుంది.
క్యారెక్టర్ తనకు నచ్చి డిమాండ్ చేస్తే అందాల ఆరబోతకు అడ్డుచెప్పనంటోంది భాను. ప్రస్తుతం నాలుగు సినిమాల్లో నటిస్తున్న భానుశ్రీ సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తుందోట. అందుకే అందాల ఆరబోస్తూ.. తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ ఫోటోషూట్లతో కుర్రకారుకి కిక్కిస్తోంది.