Bichagadu 2 Trailer: అంచనాలను అమాంతం పెంచేసిన బిచ్చగాడు-2 ట్రైలర్..!

తమిళ హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న తాజా చిత్రం ‘బిచ్చగాడు-2’ నుండి థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

Bichagadu 2 Trailer: అంచనాలను అమాంతం పెంచేసిన బిచ్చగాడు-2 ట్రైలర్..!

Bichagadu 2 Trailer Raises The Expectations

Updated On : April 29, 2023 / 1:31 PM IST

Bichagadu 2: తమిళ హీరో విజయ్ ఆంటోనీ నటించిన ‘బిచ్చగాడు’ గతంలో ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు తెలుగులోనూ అదిరిపోయే రెస్పాన్స్ దక్కడంతో విజయ్ ఆంటోనీ తెలుగువారికి దగ్గరయ్యాడు. ఇక ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘బిచ్చగాడు-2’ని విజయ్ ఆంటోనీ స్వయంగా డైరెక్ట్ చేస్తు తెరకెక్కిస్తున్నాడు. ఈ సీక్వెల్‌పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Bichagadu 2: కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బిచ్చగాడు-2.. ఈసారైనా వస్తాడా..?

వేసవి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేయగా, తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా కట్ చేశారు చిత్ర యూనిట్. ఈ సినిమా కథను ఏమాత్రం రివీల్ చేయకుండా ట్రైలర్ ఉండటంతో ఈ సినిమా కథ ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్రంలోని సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి.

Bichagadu 2: ‘చెల్లి వినవే’ పాటతో కన్నీళ్లు తెప్పిస్తున్న బిచ్చగాడు

వేసవి కానుకగా మే 19న బిచ్చగాడు-2 చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. కాగా, ఈ సినిమాలో కావ్య తాపర్ కీలక పాత్రలో నటిస్తోంది. విజయ్ ఆంటోనీ అందించిన బీజీఎం నెక్ట్స్ లెవెల్‌లో ఉండబోతుందని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ సినిమాను ఫాతిమా విజయ్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి బిచ్చగాడు-2 చిత్రానికి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.