Sonam Kapoor : సోనమ్ కపూర్ ఇంట్లో భారీ చోరీ.. ఇంట్లో పనిమనిషే 2.4 కోట్ల అపహరణ..

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సోనమ్‌ కపూర్‌ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇటీవల సోనమ్ ఇంట్లో ఈ చోరీ జరిగింది. ఈ దొంగతనంలో దాదాపు 2.4 కోట్ల విలువైన డబ్బు, నగలు దొంగలించారు. అయితే ఈ......

Sonam Kapoor : సోనమ్ కపూర్ ఇంట్లో భారీ చోరీ.. ఇంట్లో పనిమనిషే 2.4 కోట్ల అపహరణ..

So0nam

Updated On : April 15, 2022 / 4:53 PM IST

Sonam Kapoor :  బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సోనమ్‌ కపూర్‌ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇటీవల సోనమ్ ఇంట్లో ఈ చోరీ జరిగింది. ఈ దొంగతనంలో దాదాపు 2.4 కోట్ల విలువైన డబ్బు, నగలు దొంగలించారు. అయితే ఈ ఘటనపై సోనమ్ మేనేజర్ పోలీసులకి ఫిర్యాదు చేశారు. గత కొద్ది రోజులుగా ఈ కేసులో భాగంగా సోనమ్ ఇంట్లో సభ్యులు, సన్నిహితులు, ఇంటికి వచ్చిన వారందర్ని విచారించి చివరకు దొంగల్ని పట్టుకున్నారు పోలీసులు.

 

తాజాగా ఈ దొంగతనం చేసింది సోనమ్ ఇంట్లో పని చేసే నర్స్, ఆమె భర్త నరేష్ కుమార్ అని పోలీసులు విచారణలో వెల్లడించారు. సోనమ్ కపూర్ ఇంట్లో తన అత్తయ్య, సోనమ్ భర్త తల్లిని చూసుకోవడానికి కేర్ టేకర్ గా అపర్ణ రూతు విల్సన్ అనే ఓ నర్స్ ని నియమించారు. ఈమె భర్త నరేశ్ ఓ ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్ గా పని చేస్తున్నాడు. ఇటీవల భార్య భర్తలు ఇద్దరూ కలిసి ఈ డబ్బు, నగలని దొంగిలించినట్లు పోలీసులు ధృవీకరించారు.

Ujwal : కేజీఎఫ్ సినిమాని 19 ఏళ్ళ కుర్రాడి చేతిలో పెట్టిన ప్రశాంత్ నీల్.. కేజీఎఫ్ అసలు హీరో ఇతనే..

 

ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు అపర్ణ ఇంట్లో సెర్చ్ చేయగా కొన్ని నగలు దొరికాయి. వాటి గురించి అడగటంతో అసలు విషయం బయటపడింది. అయితే మిగిలిన డబ్బులు, నగలు ఏమయ్యాయి అంటూ వీరిద్దర్నీ అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేస్తున్నారు.