బిగ్ బాస్ 3: హౌస్ మేట్స్ డ్యాన్స్ అదరగొట్టారు

  • Published By: veegamteam ,Published On : October 6, 2019 / 12:43 PM IST
బిగ్ బాస్ 3: హౌస్ మేట్స్ డ్యాన్స్ అదరగొట్టారు

Updated On : October 6, 2019 / 12:43 PM IST

బిగ్ బాస్ సీజ‌న్ 3 లో ప్రస్తుతం తొమ్మిది మంది కంటెస్టెంట్లు ఉన్నారు. ఈ 76 రోజుల బిగ్ బాస్ ప్ర‌యాణంలో ఎన్నో గొడ‌వ‌లు, ప్రేమ‌లు, ఆనందాలు చూశారు. అయితే ఈ రోజు ఎపిసోడ్ వీడియోలో నాగ్ అందరితో డ్యాన్స్ చేయించనున్నారు. నవరాత్రి సందర్భంగా అందరూ నవరసాలు చూపించాలని చెప్పి ఒక్కొక్కరికీ ఒక్కో పాట పెట్టి డ్యాన్స్ చేయిస్తారు. ఇలా ఈ రోజు ఎపిసోడ్ అంతా చాలా సరదాగా గడిచిపోతుంది. 

ఇక నిన్నటి ఎపిసోడ్ విషయానికి వస్తే.. నాగ్ బిగ్ బాస్ ఇంటికి ఎవ‌రు బ‌రువు, ఎవ‌రు భారమో చెప్పాల‌ని ఇంటి స‌భ్యులకి చెప్పారు‌. భారం అయ్యేవాళ్ళు బ‌రువైన బిగ్ బాస్ బ్యాగ్ పైకి ఎత్తి ప‌ట్టుకొని ఎదుటి వాళ్ళు వీళ్ల గురించి చెప్పే వ‌ర‌కు అలానే ప‌ట్టుకోవాల‌ని అన్నారు. ముందుగా అలీ.. మ‌హేష్ పేరు చెప్పాడు. మ‌హేష్ బ్యాగ్ ని అలీ చెప్పే వ‌ర‌కు ఎత్తి ప‌ట్టుకొని ఉన్నాడు. ఆ త‌ర్వాత నాగ్.. అలీపై సీరియ‌స్ అయ్యాడు. ఎందుకంటే శివ‌జ్యోతి ట్యాంక్‌లో నీళ్ళు పోయ‌డం, వైల్డ్ కార్డ్ ద్వారా వ‌చ్చి అమ్మ‌ల‌క్క‌ల ముచ్చ‌ట్లు పెడుతున్నావ్… మాకు ఈ అలీ వద్దు.. పాత అలీ కావాల‌ని చెప్పారు‌.

ఇక వితికా శివ‌జ్యోతి ఇంటికి భార‌మ‌ని చెప్పింది. శివ‌జ్యోతి కూడా వితికా భార‌మ‌ని చెప్పింది. ఇక శ్రీముఖి, బాబా భాస్కర్ రాహుల్ పేరు చెప్ప‌గా.. రాహుల్, వ‌రుణ్ సందేశ్ మ‌హేష్ పేరు చెప్పారు, మ‌హేష్ రాహుల్ అని అన్నాడు. పునర్న‌వి కూడా మ‌హేష్ పేరు చెప్ప‌డంతో ఎక్కువ ఓట్లు మ‌హేష్‌కి ప‌డ్డాయి. దీంతో మ‌హేష్ ఈ ఇంటికి భారం అని హౌజ్‌మేట్స్ క‌న్‌ఫాం చేశారు.

ఇక ఈ సీజ‌న్ ఇంటికి చివ‌రి కెప్టెన్‌గా శ్రీముఖి నిలిచింది. ఇప్పటి నుంచి బిగ్ బాస్ హోస్ లో కెప్టెన్సీలు ఉండవని నాగ్ చెప్పారు. బ్యాటిల్ ఆఫ్‌ది మెడాలియ‌న్ టాస్క్‌లో వితికా విజేత‌గా నిల‌వ‌డంతో శ్రీముఖి వితికాకు మెడ‌ల్ వేసింది. బాబా భాస్క‌ర్ స‌ర్టిఫికెట్ అందించారు. మెడాలియ‌న్ టాస్క్‌లో విజేత‌గా నిలిచిన కార‌ణంగా వితికాకి ఇమ్యునిటి ల‌భించింది. ఈ ఇమ్యునిటితో నాలుగు వారాల‌లో ఎప్పుడైన ఒక‌సారి నామినేషన్ నుండి సేవ్ కావ‌చ్చు. ఇక నామినేష‌న్‌లో ఉన్న రాహుల్‌, మ‌హేష్‌, పున‌ర్న‌వి, వ‌రుణ్ సందేశ్‌ల‌లో రాహుల్ సేవ్ అయ్యాడు. మిగ‌తా ముగ్గురిలో ఒక‌రు రేపు ఎలిమినేట్ కానున్నారు. మరి ఆ వ్యక్తి ఎవరో చూద్దాం. సోషల్ మీడియాలో మాత్రం పునర్నవీ, మహేశ్ అని వార్తలు వినిపిస్తున్నాయి.