బిగ్ బాస్ ఎలిమినేషన్ : మహేష్ ఔట్…రాహుల్ సేఫ్

సంచలనాలకు కేరాఫ్‌గా మారిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ఎట్టకేలకు చివరి దశకు చేరుకుంటోంది. ఇప్పటికి హౌస్‌లో 8మంది ఉండగా ఇవాళ(13 అక్టోబర్ 2019) ఒకరు ఎలిమినేట్ అవుతున్నారు. ఈ వారం నామినేట్ అయిన ముగ్గురు టఫ్ వ్యక్తులు కావడంతో హౌస్‌లో నుంచి ఎలిమినేట్ అయ్యేది ఎవరా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. వరుణ్, రాహుల్, మహేష్ ముగ్గురికీ ఓటింగ్ పోటాపోటీగా జరగగా ఎలిమినేషన్ ప్రక్రియ ఆసక్తికరంగా మారింది.
గతవారం కూడా మహేష్.. బిగ్‌బాస్ హౌస్‌ను వీడుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే అప్పుడు పునర్నవి ఎలిమినేట్ అవగా.. ఈ వారం మహేష్ ఎలిమినేట్ అవుతున్నారు. మహేష్ కూడా ఇంట్లో కాస్త కాంట్రవర్శీగా మారిపోగా ఈ వారం అతను వెళ్లేందుకు టైమ్ వచ్చిందని అందరూ ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలోనే అతను ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తుంది.
ఈ వారం నామినేషన్ రౌండ్‌లో వరుణ్, రాహుల్ ఉన్నందున బాబా భాస్కర్, శ్రీముఖి ఫ్యాన్స్ ఓట్లు మహేశ్‌కు పడే అవకాశాలు ఎక్కువ. కానీ మహేశ్.. శ్రీముఖిని టార్గెట్ చేయడంతో అతనికి శ్రీముఖి ఓట్లు పడలేదు. ఈ క్రమంలో రాహుల్ సేఫ్ అయిపోయారు. వరుణ్ ఎప్పటిలాగే గేమ్‌లో తనదైన శైలిలో ఆడుతూ మంచి మార్కులు కొట్టేస్తున్నాడు. మొత్తానికి 12 వారాలు హౌస్‌లో సర్వైవ్ అయిన మహేష్ ఈ వారం ఎలిమినేట్ అవుతున్నాడు. ఇక హౌస్లో శివజ్యోత, వితిక, అలీల మధ్య ఫైనల్ బెర్త్ కోసం పోటీ నెలకొంది.