Bigg Boss 4: అవినాష్ పారితోషికం గురించి ఆసక్తికర విషయాలు!

  • Published By: sekhar ,Published On : October 12, 2020 / 08:50 PM IST
Bigg Boss 4: అవినాష్ పారితోషికం గురించి ఆసక్తికర విషయాలు!

Updated On : October 12, 2020 / 9:21 PM IST

Bigg Boss 4 Telugu: కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న Bigg Boss Season 4 Telugu రసవత్తరంగా సాగుతోంది. సెప్టెంబర్ 6న ప్రారంభమైన ఈ షోలో ఇప్పటివరకు నలుగురు ఎలిమినేట్ అయ్యారు. ఎలిమినేషన్‌లో లేకపోయినా అనారోగ్య కారణాలతో గంగవ్వ హౌస్ నుంచి తన సొంతింటి కల నెరవేర్చుకుని బయటకు వెళ్లిపోయింది.


అయితే ఈసారి టిక్‌టాక్, సోషల్ మీడియా అలాగే టీవీ ప్రోగ్రామ్స్‌లో పాపులర్ అయిన వారిని Contestants సెలెక్ట్ చేశారు. షో లో పార్టిసిపేట్ చేసినందుకుగానూ ఒక్కొక్కరికి భారీ మొత్తంలో పారితోషికం చెల్లిస్తున్నారు. ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయిన డైరెక్టర్ సూర్య కిరణ్.. తాను అడిగినదానికంటే ఎక్కేవే ఇచ్చారని.. బిగ్‌బాస్ ద్వారా వచ్చిన డబ్బుతో ఓ ఆర్నెళ్లపాటు హాయిగా బతికేస్తానని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. దీన్నిబట్టి Contestantల Remunerationలు ఏ రేంజులో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.


తాజాగా ‘జబర్దస్త్’ ఫేమ్ మాస్ అవినాష్ పారితోషికం గురించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Bigg Boss 4లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు అతనికి రూ. 9 లక్షలు ఇస్తున్నారట. ఇ అమౌంట్ షో మొత్తానికి కాదండోయ్.. ఒక్క వారానికి 9 లక్షలట.


ఇటీవల లాక్ డౌన్ టైంలో ఇంటి EMIలు వంటివి కట్టలేక పోవడం, తన దగ్గర ఉన్న డబ్బుతో తల్లిదండ్రులకు వైద్యం చేయించడం, బయట భారీ స్థాయిలో అప్పులు చేయడం వంటి కారణాలతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు అవినాష్ చెప్పాడు. వారానికి ఇంత పెద్ద మొత్తం వస్తుంది కాబట్టి అతని కష్టాలు తీరినట్టేనని, అందుకతడు అర్హుడేనని, షో లో అవినాష్ చివరి వరకు ఉంటే ఇంకా పెద్ద మొత్తంలో అమౌంట్ వస్తుందంటూ అతని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మద్దతు తెలుపుతున్నారు.