Bigg Boss 7 Day 19 : యావర్ ని ఏడిపించిన అమ్మాయిలు.. మూడో పవరాస్త్ర ఎవరు గెలుచుకున్నారు?
ఇప్పటికే రెండు పవరాస్త్రలను శివాజీ, సందీప్ గెలుచుకోగా మూడో పవరాస్త్ర కోసం గేమ్ సాగింది.

Bigg Boss 7 Day 19 Highlights Prince Yavar Shobha Shetty Priyanka Jain fight for Power astra
Bigg Boss 7 Day 19 : బిగ్బాస్ మూడో వారం ఎక్కువగా ముగ్గురు, నలుగురు మీదే గేమ్ నడిచింది. ఇక ఇప్పటికే రెండు పవరాస్త్రలను శివాజీ, సందీప్ గెలుచుకోగా మూడో పవరాస్త్ర కోసం గేమ్ సాగింది. టాస్కుల్లో చివరికి ఎక్కువసేపు కదలకుండా నిల్చొని యావర్, కారంగా ఉండే చికెన్ తిని శోభాశెట్టి, జుట్టు కత్తిరించుకొని ప్రియాంక ఉండగా ఈ ముగ్గురు మిగిలారు. అయితే చివర్లో ఈ ముగ్గురిలో ఎవరు అనర్హులో వాళ్లనే డిసైడ్ చేసుకోవాలని చెప్పి వీరి ముగ్గురి మధ్య గొడవలు పెట్టాడు బిగ్బాస్.
మొదట శోభా యావర్ పేరుని చెప్పగా, యావర్ కూడా శోభా పేరుని చెప్పాడు. ప్రియాంక ఎవరి పేరు చెప్తే వాళ్ళు సైడ్ అయిపోతారు. ప్రియాంక కూడా యావర్ పేరు చెప్పడంతో యావర్ ఫైర్ అయ్యాడు. అక్కడ ఉన్న బల్లని కోపంగా పగలకొట్టాడు. హౌస్ అంతా అరుస్తూ తిరిగాడు. ఆ తర్వాత ఏడుస్తూ కూర్చున్నాడు. శివాజీ దగ్గరికి వచ్చి తన బాధలు చెప్పుకున్నాడు. దీంతో ప్రియాంక, శోభా ఇద్దరూ కలిసి యావర్ ని ఏడ్పించేశారని ప్రేక్షకులు అనుకుంటున్నారు.
Also Read : Naveen Polishetty : టాలీవుడ్లో కపిల్ శర్మ లాంటి షో ప్లాన్.. హ్యాట్రిక్ తర్వాత నవీన్ నెక్స్ట్ సినిమాలు ఇవే..
చివరగా పవరాస్త్ర కోసం ప్రియాంక, శోభా శెట్టిలకు ఎద్దు మీద కూర్చొని తిరిగే గేమ్ పెట్టాడు. ప్రియాంక గట్టిగానే ఆగినా శోభాశెట్టి మాత్రం పడిపోయింది. అయితే పవరాస్త్ర ఎవరు గెలుచుకున్నారు అనేది ఈ వీకెండ్ ఎపిసోడ్ అంటే నేడు శనివారం ఎపిసోడ్ లో చెప్తారు అని బిగ్బాస్ చెప్పాడు. ఇవాళ నాగార్జున వచ్చి పవరాస్త్ర ఎవరు గెలుచుకున్నారో చెప్తారు.