Bigg Boss 7 Day 50 : నామినేషన్స్ తో హౌస్ లో ఫైర్.. రతికకు స్పెషల్ ఆఫర్ ఇచ్చిన బిగ్‌బాస్..
సోమవారం ఎపిసోడ్ లో రతిక రావడంతో భోలే ప్రశాంత్ దగ్గర రతిక గురించి చర్చ పెట్టాడు. అనంతరం నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. అయితే రతిక వచ్చి ఒక్కరోజే అయింది కాబట్టి ఈ వారం నామినేషన్స్ నుంచి ఆమెకు మినహాయింపు ఇస్తున్నట్టు బిగ్‌బాస్ తెలిపాడు.

Bigg Boss 7 Day 50 Highlights Nominations day
Bigg Boss 7 Day 50 : బిగ్‌బాస్ హౌస్ లో ఆదివారం పూజా మూర్తిని ఎలిమినేట్ చేసి ఇంకో లేడీ కంటెస్టెంట్ ని బయటకి పంపించేశారు. రీ ఎంట్రీ పేరుతో రతికని హౌస్ లోకి మళ్ళీ తీసుకొచ్చాడు బిగ్‌బాస్. దీంతో ఆమె అభిమానులు సంతోషిస్తున్నారు. ఇక సోమవారం ఎపిసోడ్ లో రతిక రావడంతో భోలే ప్రశాంత్ దగ్గర రతిక గురించి చర్చ పెట్టాడు. అనంతరం నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. అయితే రతిక వచ్చి ఒక్కరోజే అయింది కాబట్టి ఈ వారం నామినేషన్స్ నుంచి ఆమెకు మినహాయింపు ఇస్తున్నట్టు బిగ్‌బాస్ తెలిపాడు.
ఇక నామినేషన్స్ లో శివాజీ.. శోభాశెట్టి, ప్రియాంకలను నామినేట్ చేసాడు. గతవారం భోలెతో జరిగిన గొడవ గురించి మాట్లాడుతూ వీళ్ళని నామినేట్ చేయడంతో ఇద్దరికీ మండి శివాజీపై ఫైర్ అయ్యారు. అనంతరం అశ్విని.. శోభాశెట్టి, ప్రియాంకలను నామినేట్ చేసింది. గౌతమ్.. ప్రశాంత్, భోలేలను నామినేట్ చేశాడు. ప్రియాంక.. భోలే, అశ్వినిలను నామినేట్ చేసింది. సందీప్.. అశ్విని, భోలేలను నామినేట్ చేసాడు. శోభాశెట్టి.. శివాజీ, యావర్ లను నామినేట్ చేసింది. ఈ నామినేషన్ లో శివాజితో గొడవపడింది. పైకి మంచోడిలా కనిపిస్తూ నటిస్తున్నావంటూ ఫైర్ అయింది. భోలే గొడవని తీసుకొచ్చి అతన్ని ఎలా సమర్దిస్తావు అంటూ శివాజీపై మరోసారి ఫైర్ అయింది. అనంతరం.. భోలే.. శోభాశెట్టి, గౌతమ్ లను నామినేట్ చేశాడు.
Also Read : Bigg Boss 7 : నామినేషన్స్ హీట్ మొదలైంది.. శోభా వర్సెస్ శివాజీ, ప్రియాంక వర్సెస్ బోలే
దీంతో సోమవారం ఎపిసోడ్ ముగిసింది. మిగిలిన వాళ్ళు నేటి ఎపిసోడ్ లో నామినేషన్స్ వేయనున్నారు. ఈ నామినేషన్స్ చూస్తే భోలే, శివాజీ – శోభాశెట్టి మధ్య గొడవతోనే జరుగుతున్నట్టు తెలుస్తుంది.