Bigg Boss 7 Day 54 : ఈ వారం కొత్త కెప్టెన్ ఎవరు? మిర్చి దండలతో కెప్టెన్ ఎన్నిక..

అనేక టాస్కుల అనంతరం ప్రియాంక, గౌతమ్, శోభా, ప్రశాంత్, సందీప్ కెప్టెన్సీ కంటెండర్స్ గా నిలిచారు. వీరిలో కెప్టెన్ ని ఎన్నుకోవాలని ఇంటి సభ్యులకే పనిపెట్టాడు బిగ్‌బాస్

Bigg Boss 7 Day 54 : ఈ వారం కొత్త కెప్టెన్ ఎవరు? మిర్చి దండలతో కెప్టెన్ ఎన్నిక..

Bigg Boss 7 Day 54 Highlights new Captain in Bigg Boss House

Updated On : October 28, 2023 / 9:47 AM IST

Bigg Boss 7 Day 54 : బిగ్‌బాస్ ఎనిమిదో వారం సాగుతుంది. నామినేషన్స్ ప్రక్రియ అయ్యాక కెప్టెన్సీ టాస్కులు మొదలుపెట్టారు. అనేక టాస్కుల అనంతరం ప్రియాంక, గౌతమ్, శోభా, ప్రశాంత్, సందీప్ కెప్టెన్సీ కంటెండర్స్ గా నిలిచారు. వీరిలో కెప్టెన్ ని ఎన్నుకోవాలని ఇంటి సభ్యులకే పనిపెట్టాడు బిగ్‌బాస్. కెప్టెన్సీ కంటెండర్స్ గా ఉన్న వాళ్లకి మిగిలిన వాళ్ళు మిర్చి దండలు వేసి తమకు ఎవరు కెప్టెన్ కావాలో ఎన్నుకోవాలి అని చెప్పాడు బిగ్‌బాస్. ఎవరికి తక్కువ దండలు ఉంటే వాళ్ళు కెప్టెన్ అవుతారని చెప్పాడు బిగ్‌బాస్.

గౌతమ్ కి ఒక్క మిర్చి దండ కూడా పడకపోవడంతో గౌతమ్ హౌస్ లో కొత్త కెప్టెన్ గా ఎన్నికయ్యాడు. ఇక ఈ మిర్చి దండలు వేస్తుండగా కూడా గొడవలు అయ్యాయి. శోభాశెట్టి – యావర్, రతికలతో గొడవ పెట్టుకుంది. లేడీ కెప్టెన్ కావాలనుకొని మళ్ళీ నాకే మిర్చి దండ వేసావ్ అని రతికతో గొడవ పెట్టుకుంది శోభాశెట్టి. ప్రశాంత్ – అమర్ దీప్ మధ్య గొడవ అయింది. భోలే – ప్రియాంక మధ్య గొడవ అయింది. ఇలా కెప్టెన్ ఎన్నికలో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు అయ్యాయి.

Also Read : Sara Ali Khan – Ananya Panday : బాలీవుడ్ ముద్దుగుమ్మల జిమ్ వర్క్ అవుట్ వీడియో చూశారా..?

ఇక మళ్ళీ ప్రశాంత్ – రతిక మధ్య గొడవ జరిగింది. గతంలో వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడేమో ప్రశాంత్ రతికని అక్కా అని పిలుస్తుండటంతో రతిక ఫైర్ అయింది. నువ్ అలా పిలవడం వల్ల నాకు బయట ప్రాబ్లమ్ అవుతుంది అలా పిలవకు, కావాలంటే పేరు పెట్టి పిలువు అని చెప్పింది. అయినా ప్రశాంత్ అక్కా అనే పిలుస్తాను అని చెప్పడంతో వీరిద్దరి మధ్య గొడవ అయింది. శివాజీ వచ్చి వీరిద్దరి మధ్య సర్ది చెప్పాడు. ఇక చివర్లో కొంతమంది కంటెస్టెంట్స్ రతిక అసలు ఏమి చేయట్లేదని, తినడం, తిరగడం తప్ప ఆడట్లేదని మాట్లాడుకున్నారు. నేడు వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున అందరిమీద ఏ రేంజ్ లో ఫైర్ అవుతారో చూడాలి.