Bigg Boss 7 Day 80 : బిగ్‌బాస్‌లో మర్డర్ మిస్టరీ.. ఎవరు హంతకుడు..?

మిసెస్ బిగ్‌బాస్ ని ఎవరో హత్య చేశారు, వాళ్ళని కనిపెట్టాలి అని బిగ్‌బాస్ టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్ లో ఒకొక్కరికి ఒక్కో రోల్ ఇచ్చాడు.

Bigg Boss 7 Day 80 : బిగ్‌బాస్‌లో మర్డర్ మిస్టరీ.. ఎవరు హంతకుడు..?

Bigg Boss 7 Day 80 Highlights Secret and Investigation Tasks

Bigg Boss 7 Day 80 : మంగళవారం నాడు ప్రశాంత్ ఎవిక్షన్ పాస్ గెలుచుకున్నాడు. ఇక బుధవారం నాడు ఓ ఆసక్తికర టాస్క్ ని ఇచ్చాడు బిగ్‌బాస్. మిసెస్ బిగ్‌బాస్ ని ఎవరో హత్య చేశారు, వాళ్ళని కనిపెట్టాలి అని బిగ్‌బాస్ టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్ లో ఒకొక్కరికి ఒక్కో రోల్ ఇచ్చాడు.

ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా అర్జున్ – అమర్ దీప్, అశ్విని – శోభాశెట్టి రిపోర్టర్స్ గా, రతిక- గౌతమ్ సీక్రెట్ ప్రేమ జంటగా, టవర్ – ప్రియాంక పనిమనుషులుగా టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. అయితే శివాజీకి నువ్వే హంతకుడివి అని చెప్పి పోలీసులకు దొరక్కుండా మరిన్ని హత్యలు చేయాలని టాస్క్ ఇచ్చాడు.

ఈ టాస్క్ లో భాగంగా శోభా- అమర్ – అశ్వినిల మధ్య గొడవ అయింది. రిపోర్టర్ గా శోభా మీదిమీదికి వస్తుందని గొడవ పెట్టుకున్నాడు అమర్. అమర్.. స్మెల్ వస్తుందని, శోభాని దూరం వెళ్ళమని పదేపదే అనడంతో శోభా హర్ట్ అయి గొడవ పెట్టుకుంది. దీంతో అమర్ లాఠీ విసిరేసి కాసేపు హడావిడి చేశాడు. నేను కావాలని నిన్ను వెనక్కి తోయలేదు, గేమ్ లో భాగంగానే చేస్తున్నాను, నేను కావాలని ఎవ్వర్నీ ఆపట్లేదు అని అశ్వినిని చూసి అనడంతో.. నన్నెందుకు చూసి అంటున్నావు అంటూ అశ్విని గొడవ పెట్టుకుంది. ఇలా టాస్క్ ఆడకుండా ముగ్గురు గొడవ పడుతూ కూర్చున్నారు.

Also Read : Bigg Boss 7 Telugu : బిగ్‌బాస్ హౌస్‌లో హ‌త్య‌.. ! హంత‌కుల‌ను క‌నిపెట్టేది ఎలా..?

ఇక ప్రశాంత్ కి ఏ టాస్క్ ఇవ్వకపోవడంతో ఒక్కడే ఖాళీ రూమ్ లో కూర్చొని ఆడుకుంటూ, పడుకుంటూ ఉన్నాడు. శివాజీ తనకి ఇచ్చిన సీక్రెట్ టాస్క్ లో భాగంగా ప్రశాంత్ మొక్కని మాయం చేశాడు. మరి మిసెస్ బిగ్‌బాస్ ని ఎవరు హత్య చేశారో ఎవరు కనుక్కుంటారో నేటి ఎపిసోడ్ లో చూడాలి.