Bigg Boss 7 : బిగ్‌బాస్ టాప్ 5లో గౌతమ్.. ఆ నలుగురు కూడా? హౌస్ లో మర్డర్ మిస్టరీని సాల్వ్ చేశాడా?

హౌస్ లో రెండు టీమ్స్ ఉన్న సంగతి తెలిసిందే. అమర్ దీప్ తో సీరియల్ బ్యాచ్, శివాజీతో కొంత మంది ఉండి గ్రూపులుగా గేమ్ ఆడుతున్నారు.

Bigg Boss 7 : బిగ్‌బాస్ టాప్ 5లో గౌతమ్.. ఆ నలుగురు కూడా? హౌస్ లో మర్డర్ మిస్టరీని సాల్వ్ చేశాడా?

Bigg Boss 7 Top 5 Contestants Analysis who will be in Top 5

Updated On : November 23, 2023 / 3:53 PM IST

Bigg Boss 7 Top 5 : బిగ్‌బాస్ ఇప్పటికే 11 వారాలు పూర్తిచేసుకొని 12వ వారం సాగుతుంది. హౌస్ లో మొదట 14 మంది కంటెస్టెంట్స్ వచ్చారు. అందులో ఒక్కో వారం ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతూ వచ్చారు. అయిదు వారాల తర్వాత అయిదుగురు ఎలిమినేట్ అవ్వగా ఇంకో అయిదుగురిని వైల్డ్ కార్డు ఎంట్రీతో హౌస్ లోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత ముందే ఎలిమినేట్ అయిన రతికని మళ్ళీ తీసుకొచ్చారు. ప్రస్తుతం హౌస్ లో అమర్ దీప్, గౌతమ్, యావర్, ప్రశాంత్, శివాజీ, అర్జున్, ప్రియాంక, శోభాశెట్టి, అశ్విని,రతిక.. ఇలా పదిమంది ఉన్నారు.

గత వారం ఎలిమినేషన్ లేకపోవడంతో ఈ వారం ఇద్దరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు. ఎక్కువగా రతిక, అశ్విని, అర్జున్ పేర్లు ఈ వారం ఎలిమినేట్ అయ్యేవారిలో ఉండొచ్చని వినిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్ లో అందరి టార్గెట్ టాప్ 5 మీదే ఉంది. అయితే బిగ్‌బాస్ లీక్స్ నుంచి బయట సోషల్ మీడియాలో ప్రస్తుతం టాప్ 5 కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా హౌస్ లో ఉన్న డాక్టర్ బాబు గౌతమ్ పేరు బిగ్‌బాస్ టాప్ 5 లో ఉండి చివరి వరకు వెళ్ళబోతున్నాడని సమాచారం. మొదటి నుంచి చూస్తే అసలు గౌతమ్ చాలా మందికి తెలీదు. ఒక సినిమా హీరోగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ ఎవ్వరికి తెలీదు, ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా లేదు అయినా 11 వారాలుగా హౌస్ లోనే కొనసాగుతున్నాడు. పలుమార్లు నామినేట్ అయినా సేవ్ అవుతూనే వచ్చాడు.

ప్రస్తుతం హౌస్ లో ఓ మర్డర్ మిస్టరీ టాస్క్ జరుగుతుంది. మిసెస్ బిగ్‌బాస్ ని ఎవరో హత్య చేశారు వాళ్ళని కనిపెట్టాలి అని టాస్క్ ఇచ్చారు. ఇప్పటికే అందరూ వాళ్ళకిచ్చిన క్యారెక్టర్స్ తో ట్రై చేస్తున్నారు. ఇక ప్రశాంత్ ని కూడా డెడ్ చేసినట్టు బిగ్‌బాస్ ప్రకటించాడు. దీంతో ప్రశాంత్ దయ్యంలాగా తిరుగుతున్నాడు హౌస్ లో. అయితే ఈ హత్యలు అన్ని శివాజీ చేస్తున్నట్టు బిగ్‌బాస్ శివాజీకి చెప్పిన విషయం ఎవరికీ తెలీదు. కానీ గౌతమ్.. ప్రశాంత్ తో నిన్ను చంపేసింది శివాజీ అన్ననే కదా అని అనడంతో శివాజీ కంగారుపడినా తెలియకుండా ఉండటానికి ప్రయత్నించాడు.

హౌస్ లో రెండు టీమ్స్ ఉన్న సంగతి తెలిసిందే. అమర్ దీప్ తో సీరియల్ బ్యాచ్, శివాజీతో కొంత మంది ఉండి గ్రూపులుగా గేమ్ ఆడుతున్నారు. అయితే గౌతమ్ మాత్రం ఏ గ్రూప్ లో లేకపోవడం గమనార్హం. దీంతో అసలు ఎవరికీ తెలియని గౌతమ్ ఇన్ని వారాలుగా ఉంటూ, తన ఆటతో అదరగొడుతూ టాప్ 5 లిస్ట్ లో ఉండబోతున్నాడని తెలుస్తుంది.

Also Read : Bigg Boss 7 Day 76 : ఇక నుంచి కెప్టెన్సీ టాస్క్ లు ఉండవు.. ఆ పదాలు బ్యాన్.. కంటెస్టెంట్స్ కి వీకెండ్ షాక్ ఇచ్చిన నాగార్జున..

ఇక మిగిలిన నలుగురిలో శివాజీ, ప్రశాంత్, అమర్ దీప్, శోభాశెట్టి పేర్లు వినిపిస్తున్నాయి. శివాజీ ముందు నుంచి పెద్దన్నలాగా నటిస్తూ గేమ్ ని నడిపిస్తున్నాడు. అందరికంటే సీనియర్ కావడంతో ఆ విషయం కూడా కలిసి వచ్చింది. ఇక ప్రశాంత్ విషయంలో శివాజీ సపోర్ట్ ఉండటమే కాకుండా సింపతీ బాగా వర్క్ అవుతుంది. వచ్చిన మొదటివారం నుంచి రైతు బిడ్డ అని చెప్పుకుంటూ సింపతీ గెయిన్ చేస్తున్నాడు. ఎక్కడ అతని మీద నెగిటివ్ అయినా ఈ సింపతీని ప్లే చేస్తున్నాడు. దీంతో ప్రశాంత్ కి కూడా కొంతమంది సపోర్టర్స్ ఉన్నారు.

Also Read : Bigg Boss 7 Day 80 : బిగ్‌బాస్‌లో మర్డర్ మిస్టరీ.. ఎవరు హంతకుడు..?

అలాగే సీరియల్ బ్యాచ్ లో అమర్ దీప్, శోభాశెట్టిలు ఇద్దరూ ఫుల్ ర్యాష్ గా గేమ్స్ ఆడుతున్నారు. ఎవడొస్తాడో రమ్మను చూసుకుందాం అన్నట్టు అందరి మీద సరిచేస్తూ గేమ్ ఆడుతున్నారు. అవసరమైతే ఫిజికల్ గా కూడా గేమ్ ఆడటానికి రెడీ అయిపోతున్నారు. ఉన్న వాళ్ళల్లో వీరిద్దరే రఫ్ అండ్ టఫ్ గా ఉన్నారు. మరి ఈ అయిదుగురు టాప్ 5 లోకి వెళ్తారా? వీళ్ళు కాకుండా ఇంకెవరైనా టాప్ 5 లోకి వస్తారా అనేది చూడాలి. మరి ఫైనల్ గా తెలుగు బిగ్‌బాస్ సీజన్ 7 కప్పు ఎవరు కొడతారో చూడాలి.