Bigg Boss 5 : ఈ వారం ఎలిమినేట్ అయ్యేది తనే.. తన కోపమే తనని ముంచిందా??
మిగిలిన యాని మాస్టర్, ప్రియాలలో ఇద్దరికీ కోపం చాలా ఎక్కువ. ఇద్దరికీ ఫాలోయింగ్ కూడా తక్కువే. కానీ గత రెండు మూడు రోజులుగా ప్రియా వీజే సన్నీ మీద అరవడం, కొట్టడానికి ట్రై చేయడం
Bigg Boss 5 : బిగ్ బాస్ సీజన్ 5 చాలా రసవత్తరంగా సాగుతుంది. ఎలిమినేషన్ టైంలో మరింత ఉత్కంఠంగా మారుతుంది షో. ఇప్పటి దాకా బిగ్ బాస్ హౌజ్ నుండి ఆరుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. సరయు, ఉమాదేవి, లహరి, నటరాజ్ మాస్టర్, హమీద, శ్వేతాలు ఇప్పటి దాకా ఎలిమినేట్ అయ్యారు. ఈ సారి కూడా ఎలిమినేషన్ ఆసక్తికరంగా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ వారం ఎనిమిది మంది ఎలిమినేషన్ కోసం నామినేట్ అయ్యారు. శ్రీరామచంద్ర, లోబో, కాజల్, జెస్సీ, ప్రియ, యాని మాస్టర్, యాంకర్ రవి, సిరిలు నామినేట్ అయ్యారు.
Sonal Chauhan : ‘ఎఫ్ 3’ సినిమాలో బాలకృష్ణ హీరోయిన్
ఈ ఎనిమిది మందిలో ఇప్పటికే శ్రీరామచంద్ర, ఆర్జే కాజల్ సేఫ్ అయ్యారు. మిగిలిన ఆరుగురిలో షన్ను లేకపోవడంతో షన్ను ఓట్లు కూడా సిరికి, జెస్సికి పడి సేఫ్ అయ్యే అవకాశం ఉంది. ఇక యాంకర్ రవి ప్రతి వారం ఎలిమినేషన్ లో ఉంటున్నాడు. ప్రతి వారం సేఫ్ అవుతున్నాడు. అతనికి మంచి ఫాలోయింగ్ ఉండటంతో ఈ వారం కూడా సేఫ్. లోబోకి కూడా యాంకర్ రవి, అతని అభిమానులు మద్దతు ఉండటం అంతే కాక మొన్ననే సీక్రెట్ రూమ్ నుంచి వచ్చాడు కాబట్టి ఈ వారం ఎలిమినేట్ అవ్వడనే తెలుస్తుంది.
Radheshyam : స్టార్ హీరోల రికార్డులని బద్దలు కొట్టిన ‘రాధేశ్యామ్’ టీజర్
మిగిలిన యాని మాస్టర్, ప్రియాలలో ఇద్దరికీ కోపం చాలా ఎక్కువ. ఇద్దరికీ ఫాలోయింగ్ కూడా తక్కువే. కానీ గత రెండు మూడు రోజులుగా ప్రియా వీజే సన్నీ మీద అరవడం, కొట్టడానికి ట్రై చేయడం ఇలాంటివన్నీ ఆమెకు నెగిటివ్ అయ్యాయని చెప్తున్నారు. మొత్తానికి ఈ వారం ప్రియానే ఎలిమినేట్ అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇవాళ రాత్రి ఎపిసోడ్ చూస్తే తెలిసిపోతుంది.