Mitraaw Sharma : హర్ష సాయి ఇష్యూ తర్వాత.. కొత్త సినిమా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ మిత్రా శర్మ.. పోస్టర్ వైరల్..
తాజాగా మిత్ర శర్మ హీరోయిన్ గా కొత్త సినిమా ప్రకటించారు.

Bigg Boss fame Mitraaw Sharma announced new Movie
Mitraaw Sharma : బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న మిత్రా శర్మ ఇటీవల హర్ష సాయి మీద కేసు పెట్టి ఆ విషయంలో బాగా వైరల్ అయింది. తాజాగా మిత్ర శర్మ హీరోయిన్ గా కొత్త సినిమా ప్రకటించారు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ పోస్టర్ ఆసక్తిగా ఉన్నాయి.
గీతానంద్-మిత్రా శర్మ జంటగా రాజ్ గురు ఫిలిమ్స్ బ్యానర్ పై రాజా దరపునేని నిర్మాతగా, దయానంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘వర్జిన్ బాయ్స్’. నేడు ఈ సినిమాని ప్రకటించి పోస్టర్ రిలీజ్ చేసారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ గా వర్జిన్ బాయ్స్ సినిమా రానుంది.
Also Read : Vijayashanthi : రవితేజ సినిమాకి నో చెప్పిన విజయశాంతి.. ఆసక్తికర విషయం చెప్పిన అనిల్ రావిపూడి..
నేడు రిలీజ్ చేసిన పోస్టర్ లో ఓ అందమైన అమ్మాయి పెదాలు, ఆ పెదాలపై ముగ్గురు యువకులు విభిన్న శైలిలో కనిపించడం ఆసక్తిగా ఉంది. ‘బ్రో.. ఆర్ యు వర్జిన్?’ అనే ట్యాగ్‌లైన్ ఈ సినిమా టైటిల్ కి జోడించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా త్వరలో సమ్మర్లోనే రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాతో మిత్ర శర్మకు హీరోయిన్ గా కూడా మంచి ఎంట్రీ దొరుకుతుందేమో చూడాలి.
View this post on Instagram