Virgin Boys : ‘వర్జిన్ బాయ్స్’ మూవీ రివ్యూ.. బిగ్ బాస్ మిత్ర శర్మ అడల్ట్ కామెడీ సినిమా ఎలా ఉంది?

అప్పుడప్పుడు తెలుగులో అడల్ట్ కామెడీ సినిమాలు వస్తూ ఉంటాయి. ఈ వర్జిన్ బాయ్స్ కూడా అలాంటి సినిమానే.

Virgin Boys : ‘వర్జిన్ బాయ్స్’ మూవీ రివ్యూ.. బిగ్ బాస్ మిత్ర శర్మ అడల్ట్ కామెడీ సినిమా ఎలా ఉంది?

Mitraaw Sharma

Updated On : July 18, 2025 / 1:48 PM IST

Virgin Boys Movie Review : బిగ్ బాస్ ఫేమ్ శ్రీహాన్, మిత్రా శర్మతో పాటు గీతానంద్, జెనీఫర్ ఇమ్మానుయేల్, రోనీత్ రెడ్డి, అన్షుల కీలక పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘వర్జిన్ బాయ్స్’. రాజా దారపునేని నిర్మాణంలో దయానంద్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. వర్జిన్ బాయ్స్ సినిమా నేడు జులై 11న థియేటర్స్ లో రిలీజయింది.

కథ విషయానికొస్తే.. చిన్నప్పట్నుంచి బాయ్స్ స్కూల్, కాలేజీలో చదువుకున్న ఫ్రెండ్స్ డుండీ (శ్రీహాన్), ఆర్య (గీతానంద్), రోనీ (రోనీత్ రెడ్డి)లు మొదటిసారి కో ఎడ్యుకేషన్ యూనివర్సిటీలో జాయిన్ అవుతారు. అక్కడ కాలేజీలో అందరికీ గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారు, తమకు లేరనే నిరాశలో ఉంటారు. దీనికి తోడు సీనియర్ (కౌశల్ మందా) వీళ్ళను మరింత రెచ్చగొడతాడు. ఈ క్రమంలో మేము వర్జినిటీ కోల్పోతాము అని ఒక డెడ్ లైన్ పెట్టుకొని ఛాలెంజ్ విసురుతారు. ఈ ఛాలెంజ్ లో డుండీ జెనీఫర్‌తో, ఆర్య సరయు (మిత్రా శర్మ)తో, రోనీ శ్లోక (అన్షులా)తో ప్రేమలో పడతారు. మరి వీరి ప్రేమ ఏమైంది? వర్జినిటీ పోగొట్టుకున్నారా? వీళ్ళు చేసిన ఛాలెంజ్, డెడ్ లైన్ ఏంటి? ప్రేమ గురించి, వర్జినిటీ గురించి వీళ్ళు ఏం తెలుసుకున్నారు తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : They Call Him OG : హమ్మయ్య OG కూడా పూర్తయింది.. చెప్పిన డేట్ కి రిలీజ్.. పవన్ కొత్త పోస్టర్ వైరల్..

సినిమా విశ్లేషణ.. అప్పుడప్పుడు తెలుగులో అడల్ట్ కామెడీ సినిమాలు వస్తూ ఉంటాయి. ఈ వర్జిన్ బాయ్స్ కూడా అలాంటి సినిమానే. టైటిల్ అనౌన్స్ చేసిన దగ్గర్నుంచి పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై యూత్ కి అంచనాలు పెంచారు. ఇక ప్రమోషన్స్ లో టికెట్ కొని సినిమా కి వస్తే లక్కీ విన్నర్స్ కి ఐ ఫోన్ ఇస్తాం, థియేటర్స్ లో డబ్బులు గెలుచుకోవచ్చు లాంటి ఆఫర్స్ పెట్టి సినిమాపై మంచి బజ్ తెచ్చుకున్నారు.

ముగ్గురు ఫ్రెండ్స్ కాలేజీలో చేరేవరకు సింపుల్ గా వెళ్ళినా కాలేజీలో జాయిన్ అయ్యాక అసలు కథ మొదలవుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా బోల్డ్ జోక్స్, స్కిన్ షో, రొమాంటిక్ సీన్స్ తో యూత్ కి అట్రాక్ట్ చేసే విధంగా తెరకెక్కించారు. ఇక సెకండ్ హాఫ్ లో కాస్త ఫ్యామిలీ ఎమోషన్ తో పాటు వర్జినిటీ కోల్పోవడం కాదు నిజమైన ప్రేమ అంటే, ప్రేమ ముఖ్యం అనే అంశంతో సాగదీశారు. ఈ ముగ్గురు అబ్బాయిలు అమ్మాయిలని ఫ్లర్ట్ చేయడాలు, వాళ్ళ వెనక పడే సీన్స్ బాగానే రాసుకున్నారు. చివర్లో ముగ్గురు హీరోయిన్స్ కూర్చొని మాట్లాడుకునే సీన్స్, కొన్ని ఆచారాల్ని ప్రశ్నించడాలు అందరికి కనెక్ట్ అవ్వకపోవచ్చు. ఎంత బోల్డ్ కంటెంట్ చూపించినా చివరికి ప్రేమే ముఖ్యం అని చెప్పి కన్విన్స్ చేసాడు దర్శకుడు. మ్యాడ్, క్రష్ లాంటి సినిమా ఛాయలు కనిపించినా రొమాన్స్ విషయంలో కొత్తగానే చూపించే ప్రయత్నం చేసారు.

Mitraaw Sharma

నటీనటుల పర్ఫార్మెన్స్.. ఈ సినిమాకు శ్రీహాన్ చాలా ప్లస్ అయ్యాడు. కామెడీతో పాటు అతని నటనతో ప్రేక్షకులని మెప్పిస్తాడు. గీతానంద్, రోనీత్ రెడ్డి కూడా తమ పాత్రల్లో యూత్ ఇలాగే ఉంటారా అన్నట్టు నటించారు. మిత్రా శర్మ ఓ పక్క బోల్డ్ గా మాట్లాడుతూనే మంచి ఎమోషనల్ సీన్స్ లో మెప్పించింది. జెనీఫర్ ఇమ్మానుయేల్, అన్షులా ధావన్ తమ అందాలు బాగా ఆరబోస్తూ నటనలో పర్వాలేదనిపించారు. కౌశల్ మందా, బబ్లూ.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.

Also Read : Junior : ‘జూనియర్’ ట్రైలర్ వచ్చేసింది.. శ్రీలీల – జెనీలియా ఒకే సినిమాలో..

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ కలర్ ఫుల్ గా బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. పాటలు వినడానికి బాగున్నాయి. ప్రస్తుత జనరేషన్ ని దృష్టిలో పెట్టుకొని బోల్డ్ కాన్సెప్ట్ తో మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేసాడు దర్శకుడు. నిర్మాణ పరంగా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు కనిపిస్తుంది.

మొత్తంగా ‘వర్జిన్ బాయ్స్’ సినిమా రొమాంటిక్ కామెడీతో కాస్త బోల్డ్ గా చూపిస్తూ చివర్లో ఓ మెసేజ్ ఇచ్చారు. యూత్ అయితే సరదాగా ఈ సినిమాకు వెళ్లొచ్చు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

https://www.youtube.com/watch?v=gwVUU9UWGw0

 

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.