Sarayu : కరోనా బారిన‌పడిన బిగ్‌బాస్ సరయు

7 ఆర్ట్స్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా బోల్డ్ వీడియోలంటూ యూత్ కి దగ్గరైంది సరయు. బిగ్ బాస్ పుణ్యమా అని ఫాలోయింగ్ ని పెంచుకుంది. బిగ్ బాస్ లో మొదటి వారంలోనే బయటకి వచ్చి..........

Sarayu : కరోనా బారిన‌పడిన బిగ్‌బాస్ సరయు

Sarayu

Updated On : January 29, 2022 / 7:04 AM IST

Sarayu :   ప్రస్తుతం రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ సారి చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. టాలీవుడ్ తో సహా అన్ని సినీ పరిశ్రమలలో సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. కరోనా థర్డ్ వేవ్ ఎవ్వర్నీ వదలట్లేదు. తాజాగా బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న 7ఆర్ట్స్ సరయు కూడా కరోనా బారిన పడింది.

7ఆర్ట్స్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా బోల్డ్ వీడియోలంటూ యూత్ కి దగ్గరైంది సరయు. బిగ్ బాస్ పుణ్యమా అని ఫాలోయింగ్ ని పెంచుకుంది. బిగ్ బాస్ లో మొదటి వారంలోనే బయటకి వచ్చి అన్యాయంగా పంపించేశారు అంటూ రచ్చ కూడా చేసింది. కానీ బిగ్ బాస్ వల్ల తనకి లాభమే జరిగిందని చెప్పొచ్చు. బిగ్ బాస్ ముందు కేవలం యూట్యూబ్ ఛానల్ లో మాత్రమే వీడియోలు చేసేది. బిగ్ బాస్ తర్వాత సినిమాల్లో, వెబ్ సిరీస్ లలో కూడా ఛాన్సులు సంపాదిస్తుంది. ఇటు టీవీ షోలలో కూడా కనిపిస్తుంది.

Naga Chaitanya : ఓటిటిలోకి నాగ చైతన్య.. హీరోగా.. విలన్‌గా..

తాజాగా సరయు కరోనా బారిన పడినట్టు తన సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. ”నా స్నేహితులు. నా శ్రేయాభిలాషులకు నాకు కరోనా వచ్చిందని తెలియచేస్తున్నాను. ఇటీవల కాలంలో నన్ను కాంటాక్ట్ అయిన వాళ్లంతా టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను” అని పోస్ట్ చేసింది. అభిమానులు , నెటిజన్లు కామెంట్స్ లో త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు.

View this post on Instagram

A post shared by 7 Arts Sarayu (@7arts_sarayu)