Bigg Boss 7 : పల్లవి ప్రశాంత్ కెప్టెన్సీ ఊడింది..! ఏడ్చేసిన రైతు బిడ్డ..!
తాజాగా నేటి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమోను విడుదలైంది. ఈ ప్రొమోలో ఓ కెప్టెన్ ఎలా ఉండాలి అని అనుకుంటున్నారో చెప్పాలని ఇంటి సభ్యులను బిగ్‌బాస్ అడిగాడు.
Bigg Boss 7 Telugu : బిగ్‌బాస్ సీజన్ 7లో విజయవంతంగా ఐదు వారాలు పూర్తి అయ్యాయి. ఐదుగురు కంటెస్టెంట్లు కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతిక, శుభ శ్రీ లు ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం ఆరోవారం కొనసాగుతోంది. కొత్తగా ఐదుగురు వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చారు. కొత్తగా హౌస్‌లోకి అడుగుపెట్టిన వాళ్లు ఎలా ఆడతారో చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా.. తాజాగా నేటి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమోను విడుదలైంది. ఈ ప్రొమోలో ఓ కెప్టెన్ ఎలా ఉండాలి అని అనుకుంటున్నారో చెప్పాలని ఇంటి సభ్యులను బిగ్‌బాస్ అడిగాడు.
తొలుత శోభ మాట్లాడుతూ.. కెప్టెన్ అంటే ఇంట్లో అందరినీ తన కంట్రోల్లో పెట్టుకోవాలని అంటుంది. తన పని తాను చేస్తూ మిగిలిన వారితో కూడా పని చేయించాలని ఆట సందీప్ అన్నాడు. ఇలా అందరూ తమ తమ అభిప్రాయాలను చెబుతారు. చివరగా బిగ్‌బాస్.. పల్లవి ప్రశాంత్‌ను మంచి కెప్టెన్ ఎలా ఉండాలని అడుగుతాడు. ఇంటి సభ్యులు ఎవరు కూడా తన మాట వినడం లేదు అని ప్రశాంత్ బిగ్‌బాస్‌కు చెబుతాడు.
Chiranjeevi : అమితాబ్ బచ్చన్ KBC షోలో చిరంజీవి.. ట్వీట్‌తో హింట్..
ఈ సీజన్లో మొదటి కెప్టెన్ అయిన పల్లవి ప్రశాంత్ బ్యాడ్ కెప్టెన్ అని ఎంతమంది అనుకుంటున్నారు అని బిగ్‌బాస్ హౌస్‌మేట్స్‌ని అడుగుతాడు. అంగీకరించే వాళ్లు చేతులు ఎత్తాలని చెబుతాడు. దాదాపు అందరూ కూడా చేతులు ఎత్తడంతో బిగ్‌బాస్ అతడిని కెప్టెన్సీ నుంచి తొలగించాడు. దీంతో ప్రశాంత్ ఏడుస్తూ అక్కడి నుంచి బయటకు వెళ్లిపోతాడు. మొత్తంగా బుధవారం నాటి ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందని ప్రొమో బట్టి అర్థం అవుతోంది.