Bigg Boss 7 Nominations : ఈ వారం నామినేషన్స్‌లో ఉంది వీరేనా..? మాటల యుద్ధం ఆగట్లేదుగా..!
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7లో ఎనిమిది వారాలు విజయవంతంగా ముగిశాయి. తొమ్మిదో వారం మొదలైంది. వారం మొదటి రోజు నామినేషన్స్ రచ్చ ఉంటుందిగా.

Bigg Boss Telugu 7 Day 57 Promo
Bigg Boss Nominations : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7లో ఎనిమిది వారాలు విజయవంతంగా ముగిశాయి. ఎనిమిది వారాల్లో ఎనిమిది మంది ఎలిమినేట్ అయ్యారు. మొదటి వారంలో కిరణ్ రాథోడ్, రెండో వారంలో షకీలా, మూడో వారంలో సింగర్ దామిని, నాలుగో వారంలో రతిక రోజ్, ఐదో వారంలో శుభ శ్రీ, ఆరో వారంలో నయని పావని, ఏడో వారంలో పూజా మూర్తి, ఎనిమిదో వారంలో సందీప్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. వీరిలో రతిక రోజ్ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక తొమ్మిదో వారం మొదలైంది. వారం మొదటి రోజు నామినేషన్స్ రచ్చ ఉంటుందిగా.
కాగా.. నేటి నామినేషన్స్‌కు సంబంధించిన ప్రొమో విడుదలైంది. ప్రతిసారి లాగానే ఈ సారి కూడా నామినేషన్లు వాడీవేడీగా జరిగినట్లు తెలుస్తోంది. నామినేషన్ చేయాలనుకునే ఇద్దరు ఇంటి సభ్యులను డ్రాగన్ స్నేక్ ముందు నిలబెట్టాలని బిగ్‌బాస్ సూచించాడు. నామినేషన్ అనంతరం డ్రాగన్ స్నేక్ నోట్లోంచి వచ్చే రంగు వారిపై పడుతుందన్నాడు.
Renjusha Menon : మలయాళ నటి అనుమానాస్పద మరణం..
ఎవరితో తాను మాట్లాడిని ఆ కారణాన్ని పట్టుకుని తనను నామినేట్ చేయడం తనకు నచ్చడం లేదని అమర్ దీప్ చెబుతూ పల్లవి ప్రశాంత్‌ను నామినేట్ చేశాడు. ఆ తరువాత రతికను ప్రియాంక జైన్ నామినేట్ చేసింది. భోలే షావలి, ప్రియాంక ల మధ్య వాడీవేడీ వాదనలు జరిగాయి. ఆ తర్వాత అంబటి అర్జున్, శోభా శెట్టి మధ్య మాటల యుద్ధం నడిచింది. మన మధ్య ఉన్నంత వరకు మజాక్ అని, బయట చూసే వాళ్లకు మజాక్ కాదని చెబుతూ అర్జున్..శోభను నామినేట్ చేశారు. ఇక టాస్కుల్లో విజయాలను బట్టీ కంటెస్టెంట్లకు కెప్టెన్సీ ఇవ్వాలనీ టేస్టీ తేజా బిగ్‌బాస్‌కు విన్నవించుకున్నాడు. డిసర్వ్, అన్‌డిసర్వ్ అంటూ కంటెస్టెంట్లకు కెప్టెన్‌ను ఎంపిక చేయాలని చెప్పి పంచాయతీ పెట్టవద్దని కోరారు.
ఇక ఈ వారం నామినేషన్స్‌లో అర్జున్ అంబటి, ప్రిన్స్ యావర్, భోలే షావలి, అమర్ దీప్ చౌదరి, టేస్టీ తేజా, శోభా శెట్టి, రతిక రోజ్, ప్రియాంక జైన్ ఉన్నట్లుగా తెలుస్తోంది. చూడాలి మరీ వీరిలో ఎంత మంది నామినేషన్స్‌లో ఉన్నారో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.