Bigg Boss 8 : ఈ వారం ఎలిమినేషన్ ఎవరు..? బిర్యానీ వర్సెస్ రైస్..
ఆదివారం ఎలిమినేషన్ ఎలాగో ఉంటుంది కాబట్టి ఎలిమినేషన్ ప్రక్రియ కూడా సాగింది.

Bigg Boss Telugu Season 8 Fourth Week Elimination Latest Promos
Bigg Boss 8 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నాలుగోవారం చివరికి వచ్చేసింది. ఇప్పటికే మూడు వారాలు ముగ్గురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వగా ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అని బిగ్ బాస్ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. తాజాగా నేటి ఎపిసోడ్ ప్రోమోలని రిలీజ్ చేసారు.
ఆదివారం కాబట్టి కచ్చితంగా కాసేపు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ట్యూన్ ప్లే చేస్తే ఆ సాంగ్ కి సంబంధించిన ఫొటోలు పట్టుకొచ్చి బోర్డు మీద పెట్టాలి అనే గేమ్ ని ఇచ్చారు. రెండు టీమ్స్ బాగానే ఆడుతూ మధ్యలో స్టెప్పులతో కంటెస్టెంట్స్ అంతా అదరగొట్టేసారు. అలాగే కొన్ని చిట్టీలు ఇచ్చి అందులో వచ్చే టైటిల్స్ హౌస్ లో ఎవరికో ఒకరికి సజెస్ట్ చేయాలి అనే గేమ్ ఇచ్చారు.
Also See : Janhvi Kapoor : ‘దేవర’ రిలీజ్ తర్వాత మెరిసిపోతున్న తంగం.. జాన్వీ కపూర్ స్పెషల్ ఫొటోషూట్..
ఇక ఆదివారం ఎలిమినేషన్ ఎలాగో ఉంటుంది కాబట్టి ఎలిమినేషన్ ప్రక్రియ కూడా సాగింది. నాలుగో వారం నామినేషన్స్ లో పృథ్వి, నాగమణికంఠ, ఆదిత్య, ప్రేరణ, సోనియా, నబీల్ ఉన్నారు. అయితే ఇప్పటికే నబిల్ సేఫ్ అయ్యాడు. మిగిలిన వాళ్లకు ఒక్కొక్కరికి ఒక్కో కుండ ఇచ్చారు. ఆ కుందా ఓపెన్ చేస్తే బిర్యానీ ఉంటే సేఫ్, రైస్ ఉంటే ఎలిమినేట్ అని చెప్పారు నాగార్జున. మరి ఎవరికీ బిర్యానీ వచ్చిందో, ఎవరికీ రైస్ వచ్చిందో ఇవాళ రాత్రి ఎపిసోడ్ లో చూడాలి.
అలాగే వైల్డ్ కార్డు ఎంట్రీలు కూడా ఉన్నాయని ఇటీవల చెప్పారు. దీంతో ఈ వారం ఎవర్నైనా వైల్డ్ కార్డు ఎంట్రీతో తీసుకొస్తారేమో చూస్తున్నారు. ఇప్పటికే వచ్చిన లీకుల ప్రకారం ఈ వారం ఆర్జీవీ భామ సోనియా ఎలిమినేట్ అవుతుందని సమాచారం.