Bigg Boss 8 – Abhai Naveen : బిగ్ బాస్ 8 మొదలు.. మూడో కంటెస్టెంట్.. హీరో, డైరెక్టర్ అభయ్ నవీన్ గురించి తెలుసా?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో మూడో కంటెస్టెంట్ గా అభయ్ నవీన్ ఎంట్రీ ఇచ్చాడు.

Bigg Boss Telugu Season 8 Started Third Contestant Abhai Naveen
Bigg Boss 8 – Abhai Naveen : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ గా ప్రారంభమైంది. నాగార్జున హోస్ట్ గా కంటెస్టెంట్స్ ని పిలుస్తుండగా ఒక్కొక్కరు గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. స్పెషల్ పర్ఫార్మెన్స్ లతో కంటెస్టెంట్స్ లు మంచి ఎంట్రీ ఇస్తున్నారు. మొదటి కంటెస్టెంట్ గా సీరియల్ నటి యష్మి గౌడ రాగా, రెండో కంటెస్టెంట్ గా సీరియల్ నటుడు నిఖిల్ మలియక్కల్ రాగా మూడో కంటెస్టెంట్ గా నటుడు, దర్శకుడు అభయ్ నవీన్ వచ్చాడు.
Also Read : Bigg Boss 8 – Nikhil Maliyakkal : బిగ్ బాస్ 8 మొదలు.. సెకండ్ కంటెస్టెంట్ ఇతనే.. నిఖిల్ గురించి తెలుసా?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో మూడో కంటెస్టెంట్ గా అభయ్ నవీన్ ఎంట్రీ ఇచ్చాడు. పెళ్లి చూపులు సినిమాతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న అభయ్ నవీన్ ఆ తర్వాత అనేక సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా చేసాడు. హీరోగా కూడా చేసాడు. ఇటీవల హీరోగా తనే దర్శకుడిగా రామన్న యూత్ అనే సినిమాని తీసాడు. ఆ సినిమా థియేటర్స్ లో పర్వాలేదనిపించింది. నటుడిగా, దర్శకుడిగా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఇలా బిగ్ బాస్ ఆఫర్ రావడంతో హౌస్ లోకి వచ్చేసాడు. మరి ఈ బిగ్ బాస్ క్రేజ్ తన కెరీర్ కి ఎలా ఉపయోగపడుతుందో చూడాలి.