Bigg Boss 8 – Nikhil Maliyakkal : బిగ్ బాస్ 8 మొదలు.. సెకండ్ కంటెస్టెంట్ ఇతనే.. నిఖిల్ గురించి తెలుసా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో రెండో కంటెస్టెంట్ గా నిఖిల్ మలయక్కల్ ఎంట్రీ ఇచ్చాడు.

Bigg Boss 8 – Nikhil Maliyakkal : బిగ్ బాస్ 8 మొదలు.. సెకండ్ కంటెస్టెంట్ ఇతనే.. నిఖిల్ గురించి తెలుసా?

Bigg Boss Telugu Season 8 Started Second Contestant Nikhil Malyakkal

Updated On : September 1, 2024 / 7:37 PM IST

Bigg Boss 8 – Nikhil Maliyakkal : తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ గా ప్రారంభమైంది. నాగార్జున హోస్ట్ గా కంటెస్టెంట్స్ ని పిలుస్తుండగా ఒక్కొక్కరు ఎంట్రీ ఇస్తున్నారు. రావడంతోనే స్పెషల్ పర్ఫార్మెన్స్ లతో కంటెస్టెంట్స్ లు అదరగొడుతున్నారు. మొదటి కంటెస్టెంట్ గా సీరియల్ నటి యష్మి గౌడ రాగా రెండో కంటెస్టెంట్ గా సీరియల్ నటుడు నిఖిల్ మలియక్కల్ వచ్చాడు.

Also Read : Bigg Boss 8 – Yashmi Gowda : బిగ్ బాస్ 8 మొదలు.. మొదటి కంటెస్టెంట్ ఈమే.. యాష్మి గౌడ్.. ఎవరంటే..?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో రెండో కంటెస్టెంట్ గా నిఖిల్ మలయక్కల్ ఎంట్రీ ఇచ్చాడు. కర్ణాటకకు చెందిన ఇతను ఇక్కడ తెలుగులో గోరింటాకు, అమ్మకు తెలియని కోయిలమ్మ, స్రవంతి.. లాంటి పలు సీరియల్స్ తో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. సీరియల్స్ తో పాటు ఇక్కడి టీవీ షోలలో కూడా పాల్గొని పాపులర్ అయ్యాడు. ఇలా సీరియల్స్ తో గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ బిగ్ బాస్ సీజన్ 8 లో రెండో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. హౌస్ లో ఎలా ఆడతాడో చూడాలి.

View this post on Instagram

A post shared by STAR MAA (@starmaa)