Bigg Boss 8 – Yashmi Gowda : బిగ్ బాస్ 8 మొదలు.. మొదటి కంటెస్టెంట్ ఈమే.. యాష్మి గౌడ్.. ఎవరంటే..?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో మొదటి కంటెస్టెంట్ గా యష్మి గౌడ ఎంట్రీ ఇచ్చింది.

Bigg Boss Telugu Season 8 Started First Contestant Yashmi Gowda
Bigg Boss 8 – Yashmi Gowda : తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ గా నేడు మొదలయింది. స్టార్ మా ఛానల్ లో నేడు 7 గంటల నుంచి లాంచింగ్ ఎపిసోడ్ నాగార్జున హోస్ట్ గా మొదలయింది. ఎంతోమంది ప్రేక్షకులు, బిగ్ బాస్ అభిమానులు ఎవరెవరు కంటెస్టెంట్స్ గా వస్తారా అని ఎదురుచూసిన చూపులకు శుభం కార్డు పడింది. నాగార్జున ఒక్కొక్కరిని స్టేజిపైకి పిలుస్తుండటంతో స్పెషల్ పర్ఫార్మెన్స్ లతో కంటెస్టెంట్స్ లు ఎంట్రీ ఇస్తున్నారు.
Also See : Gautam Ghattamaneni : అమెరికాలో మహేష్ తనయుడు గౌతమ్ ఘట్టమనేని పుట్టిన రోజు వేడుకల ఫొటోలు..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో మొదటి కంటెస్టెంట్ గా యష్మి గౌడ ఎంట్రీ ఇచ్చింది. సీరియల్ నటిగా యష్మి గౌడ మంచి గుర్తింపు తెచ్చుకుంది. నాగభైరవి, కృష్ణ ముకుంద మురారి, స్వాతి చినుకులు.. లాంటి పలు తెలుగు సీరియల్స్ తో గుర్తింపు తెచ్చుకుంది ఈ కన్నడ భామ. సూపర్ జోడి.. లాంటి పలు టీవీ షోలలో కనపడి అలరించింది. ఇన్నాళ్లు సీరియల్స్, షోలతో గుర్తింపు తెచ్చుకున్న కన్నడ భామ యష్మి గౌడ ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మరి ఈ సీజన్ లో యష్మి బిగ్ బాస్ లో ఎలా మెప్పిస్తుందో చూడాలి.